Chandrika Krishnamurthy Tandon: ఇంద్రనూయి సోదరికి గ్రామీ అవార్డు
ABN, Publish Date - Feb 04 , 2025 | 05:08 AM
భారత సంతతికి చెందిన అమెరికా పౌరురాలైన ఆమె పారిశ్రామికవేత్తగా ఉంటూనే గాయనిగా ఈ ఘనత సాధించారు. 67వ గ్రామీ అవార్డుల్లో భాగంగా ‘‘బెస్ట్ న్యూ ఏజ్, యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్’’ విభాగంలో ఆమె ఆల్బమ్ త్రివేణికి గ్రామీ అవార్డు దక్కింది.
71 ఏళ్ల వయసులో చంద్రిక ఘనత
త్రివేణి ఆల్బమ్‌కు దక్కిన గౌరవం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: పెప్సికో మాజీ సీఈవో ఇంద్రనూయి సోదరి, ప్రముఖ సంగీత విద్వాంసురాలు చంద్రికా కృష్ణమూర్తి టాండన్ ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. భారత సంతతికి చెందిన అమెరికా పౌరురాలైన ఆమె పారిశ్రామికవేత్తగా ఉంటూనే గాయనిగా ఈ ఘనత సాధించారు. 67వ గ్రామీ అవార్డుల్లో భాగంగా ‘‘బెస్ట్ న్యూ ఏజ్, యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్’’ విభాగంలో ఆమె ఆల్బమ్ త్రివేణికి గ్రామీ అవార్డు దక్కింది. ఈ విభాగంలో రికీ కెజ్, అనౌష్క శంకర్ లాంటి వారు పోటీపడినా 71 ఏళ్ల చంద్రికనే గ్రామీ వరించింది. తన సంగీత సహకారులైన దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్లూట్ విద్వాంసుడు వౌటెర్ కెల్లర్‌మ్యాన్, జపాన్‌కు చెందిన సెల్లో విద్వాంసుడు యెరు మట్సుమోటోతో కలసి చంద్రిక ఈ అవార్డు సాధించారు.
పారిశ్రామికవేత్తగా, మహా వితరణశీలిగా ఇంద్రనూయి అక్క చంద్రిక గతంలోనే గుర్తింపుపొందారు. చంద్రకా టాండన్ 1954లో చెన్నైలో జన్మించారు. అహ్మదాబాద్ ఐఐఎంలో పట్టా పొందిన తర్వాత సిటీ బ్యాంక్‌లో పనిచేయడానికి లెబనాన్ వెళ్లారు. అంతర్యుద్ధం కారణంగా అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్లి ప్రఖ్యాత మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ మెక్‌కిన్సేలో చేరారు. 2015లో భర్త రంజన్ టాండన్‌తో కలసి 100 మిలియన్ డాలర్లు న్యూయార్క్ వర్సిటీకి విరాళంగా ఇచ్చారు.
మరిన్ని...
Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్!
Cancer in India: దేశానికి క్యాన్సర్ సవాల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 04 , 2025 | 05:08 AM