General Upendra Dwivedi: పాక్, చైనాల కుమ్మక్కునూరు శాతం నిజం
ABN, Publish Date - Mar 09 , 2025 | 02:39 AM
ఈ కారణంగా పశ్చిమం, ఉత్తరం..రెండు దిక్కులా దాడిని ఎదుర్కొవాల్సిన ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఇక్కడ ఒక ఆంగ్ల న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాక్ వద్ద ఉన్న ఆయుధాలన్నీ చైనాలో తయారైనవేనని అన్నారు.
సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది
న్యూఢిల్లీ, మార్చి 8: పాకిస్థాన్, చైనాలు నూరు శాతం కుమ్మక్కయ్యాయని, ఈ వాస్తవాన్ని భారత్ గుర్తించకతప్పదని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా పశ్చిమం, ఉత్తరం..రెండు దిక్కులా దాడిని ఎదుర్కొవాల్సిన ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఇక్కడ ఒక ఆంగ్ల న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాక్ వద్ద ఉన్న ఆయుధాలన్నీ చైనాలో తయారైనవేనని అన్నారు. సీమాంతర ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ పొరుగుదేశం నుంచి ఉగ్రవాదుల రాక ఏమీ తగ్గలేదని చెప్పారు. వారి రాక పెరగనుందని, పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘‘గత ఏడాది పట్టుబడిన ఉగ్రవాదుల్లో 60ు మంది పాకిస్థాన్ మూలాలు ఉన్నవారే. అందువల్ల పొరుగు దేశం నుంచి ఇంకా ముప్పు తొలగిపోలేదు’’ అని ఆయన వివరించారు. దేశంలో ప్రస్తుతం ‘యుద్ధమూ లేదు... శాంతీ లేదు’ అన్నట్లుగా పరిస్థితి ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 09 , 2025 | 02:39 AM