ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Etikoppaka toys: ఏటికొప్పాక బొమ్మలతో ఏపీ శకటం

ABN, Publish Date - Jan 23 , 2025 | 04:22 AM

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏటికొప్పాక బొమ్మలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీర్చిదిద్దిన శకటం గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో నిర్వహించే పరేడ్‌లో అలరించనుంది.

ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు ఎంపిక

దక్షిణాది నుంచి ఏపీ, కర్ణాటకకు మాత్రమే అవకాశం

తెలంగాణ శకటానికి దక్కని చోటు

న్యూఢిల్లీ, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏటికొప్పాక బొమ్మలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీర్చిదిద్దిన శకటం గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో నిర్వహించే పరేడ్‌లో అలరించనుంది. సహజసిద్ధమైన రంగుల వాడకం, జీఐ ట్యాగింగ్‌ వంటి ప్రత్యేకతలు ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటాన్ని రక్షణ శాఖ అధికారులు ఈఏడాది రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికచేశారు. పరేడ్‌లో ప్రదర్శించే శకటాలను రక్షణ శాఖ అధికారులు మీడియా ప్రతినిధులకు ఇక్కడి రాష్ట్రీయ రంగశాల క్యాంప్‌లో బుధవారం చూపించారు. ‘‘ఏటికొప్పాక బొమ్మలు- పర్యావరణహిత చెక్క బొమ్మలు’’ నేపథ్యంతో ఏపీ ప్రభుత్వం రూపొందించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీ శకటంపై తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, వినాయకుడి విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే పనివారు, బొమ్మలతో ఆడుకుంటున్న చిన్న పిల్లలు, తదితర అంశాల మేళవింపుతో శకటాన్ని రూపొందించారు. గతంలో మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఏటికొప్పాక బొమ్మల ప్రాధాన్యం గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం ఏపీ, కర్ణాటక శకటాలను పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. తెలంగాణ శకటానికి చోటు దక్కలేదు.


కలగాపులగంగా తెలంగాణ శకటం

రాష్ట్రాల ఔన్నత్యం, వారసత్వ సంపద, సంస్కృతిని చాటే శకటాల ప్రదర్శనలో తెలంగాణకు నిరాశే ఎదురైంది. సరైన థీమ్‌ లేకుండా రుద్రమదేవి, రామప్ప గుడి, పేరిణి నృత్యకారులు, ఏటీసీలు, పర్యాటక ప్రదేశాల చిత్రాలతో కలగాపులగంగా ఉందంటూ తెలంగాణ శకట నమునాను రక్షణ శాఖ తిరస్కరించినట్లు తెలిసింది. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఎర్రకోట ప్రాంగణంలో జరిగే భారత్‌ పర్వ్‌లో మాత్రం తెలంగాణ శకటాన్ని ప్రదర్శించనున్నారు. ‘‘స్వర్ణిమ్‌ భారత్‌: విరాసత్‌ ఔర్‌ వికాస్‌’’ అనే థీంతో జనవరి 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 16 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన 10 శకటాలను ప్రదర్శించనున్నారు.

Updated Date - Jan 23 , 2025 | 04:22 AM