ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: ఇక మోదీ పట్టులో ఢిల్లీ

ABN, Publish Date - Feb 09 , 2025 | 04:52 AM

దీంతో ఢిల్లీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తుందని, ప్రధానమంత్రి కార్యాలయం ఢిల్లీ అభివృద్ధి, పరిపాలనపై కీలక నిర్ణయాలు తీసుకుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

21కి పెరిగిన ఎన్డీయే పాలిత రాష్ట్రాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో దేశంలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సంఖ్య 21కి పెరిగింది. దీంతో ఢిల్లీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తుందని, ప్రధానమంత్రి కార్యాలయం ఢిల్లీ అభివృద్ధి, పరిపాలనపై కీలక నిర్ణయాలు తీసుకుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఢిల్లీ ప్రభుత్వం గతంలో మాదిరిగా ప్రతిదానికీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. శాంతిభద్రతల యంత్రాంగం కూడా కేంద్రం అధీనంలో ఉండడంవల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు అవకాశాలు ఉండవు.. ఢిల్లీలో మౌలిక సదుపాయాల నిర్మాణం, యమునా నది, వాతావరణ కాలుష్యాన్ని నివారించడంపై కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే సెంట్రల్‌ విస్తా, భారతీయ మండపం, సొరంగ మార్గాలు, మెట్రో విస్తరణపై వేగంగా చర్యలు తీసుకున్న మోదీ సర్కారు ఢిల్లీ మొత్తం అభివృద్ధికి నడుంకట్టవచ్చు. దాంతో ఢిల్లీ ఒక అధునాతన అంతర్జాతీయ రాజధానిగా మారే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంమీద ఢిల్లీ మోదీ అధీనంలోకి వస్తుందని, తనకు అనుగుణంగా నడుచుకునే ముఖ్యమంత్రిని నియమించి పరిపాలనను అదుపులోకి తెచ్చుకుంటారని ఆ వర్గాలు అంటున్నాయి.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 04:52 AM