Kejriwal: ఐదేళ్లలో కేజ్రీవాల్ ఒక్క రోజే అసెంబ్లీకి..
ABN, Publish Date - Jan 23 , 2025 | 04:54 AM
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ గత ఐదేళ్లలో ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ గత ఐదేళ్లలో ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్‌రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గెహ్లోత్, శాసనసభ స్పీకర్ రామ్‌నివాస్ గోయెల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా కూడా ఒక్క రోజు మాత్రమే ఢిల్లీ శాసనసభ సమావేశాలకు హాజరయ్యారని తెలిపింది. ఢిల్లీ శాసనసభ వెబ్‌సైటులో అందుబాటులో ఉన్న సమాచారం, ఢిల్లీ అసెంబ్లీ సెక్రటేరియేట్ నుంచి వచ్చిన ఆర్టీఐ సమాధానాల ఆధారంగా ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది.
2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి డిసెంబరు 2024 వరకు ఢిల్లీ శాసనసభ గత ఐదేళ్లలో సగటున ఏటా 15 రోజులు సమావేశమైందని, మొత్తంగా 74 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగాయని పేర్కొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అతీశీ 31 రోజులు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారని తెలిపింది. కాగా, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యతరగతి మేనిఫెస్టో అంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ 7డిమాండ్లను లేవనెత్తారు. పన్ను ఉగ్రవాదానికి మధ్యతరగతి ప్రజలు బాధితులుగా మారారని ఆయన చెప్పారు. విద్య బడ్జెట్‌ను 2 నుంచి పది శాతానికి పెంచాలని, జీడీపీలో పది శాతం ఆరోగ్యరంగానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.
ఇది కూడా చదవండి..
Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో
State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు
influential Indians : సత్యం.. సుందరం!
Read More National News and Latest Telugu News
Updated Date - Jan 23 , 2025 | 04:55 AM