ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Elections: నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

ABN, Publish Date - Feb 05 , 2025 | 04:24 AM

అధికార ఆమ్‌ ఆద్మీని ఇంటికి పంపించేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను సంధించింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా మొదలు కొని ఏపీ సీఎం చంద్రబాబు వరకు అందరినీ రంగంలోకి దించింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వరాలు ఆ పార్టీ అవకాశాలను మెరుగు పరిచిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి.

క్లైమాక్స్‌కు చేరిన హస్తిన రాజకీయ పోరు

గెలుపుపై కమలం ఆశాభావం

అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్‌

అధికారం నిలుపుకోడానికి ఆప్‌ అష్టకష్టాలు

ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం చేయనున్న ఓటర్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్థమయింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అధికార ఆమ్‌ ఆద్మీని ఇంటికి పంపించేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను సంధించింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా మొదలు కొని ఏపీ సీఎం చంద్రబాబు వరకు అందరినీ రంగంలోకి దించింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వరాలు ఆ పార్టీ అవకాశాలను మెరుగు పరిచిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రధానంగా ఆదాయ పన్ను మినహాయింపును రూ.12 లక్షలకు పెంచడంతో మధ్య తరగతి ప్రజలు తమకు అనుకూలంగా ఓటేసే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఆమ్‌ ఆద్మీ మాత్రం బడుగు, బలహీన వర్గాలపైనే ఆశలు పెట్టుకుంది.


గత పదేళ్లలో ఆ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, మరోసారి తమకే అధికారం అప్పగిస్తారని కేజ్రీవాల్‌ బలంగా విశ్వసిస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా దక్కించుకోని కాంగ్రెస్‌ ఈసారి ఒకటి లేదా రెండు సీట్లను గెలిచే అవకాశం ఉందని అంచనా. అయితే, ఈ పార్టీకి ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్‌ ఓటు శాతం పెరిగితే అది ఆమ్‌ ఆద్మీకి తీరని నష్టం చేసి, బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13,033పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యంతో 7,553 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 8న ఫలితాలు రానున్నాయి.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 04:26 AM