Maoists : మావోయిస్టుల కుట్ర భగ్నం.. 50 కిలోల ఐఈడీ నిర్వీర్యం
ABN, Publish Date - Jan 24 , 2025 | 05:04 AM
బీజాపూర్‌లోని ఓ రాష్ట్ర రహదారిపై భద్రతాబలగాలే టార్గెట్‌గా మావోయిస్టులు అమర్చిన భారీ ఐఈడీని సీఆర్పీఎఫ్ బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మావోయిస్టులు
కల్వర్ట్ కింద అమర్చిన నక్సల్స్
గుర్తించిన సీఆర్పీఎఫ్.. మరో బాంబుతో పేల్చివేత
సుకుమాలో భారీ డంప్ స్వాధీనం
చర్ల/చింతూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): బీజాపూర్‌లోని ఓ రాష్ట్ర రహదారిపై భద్రతాబలగాలే టార్గెట్‌గా మావోయిస్టులు అమర్చిన భారీ ఐఈడీని సీఆర్పీఎఫ్ బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మావోయిస్టులు ఆవపల్లి-బసగూడ రాష్ట్ర రహదారిలో తిమ్మాపూర్ దుర్గ ఆలయం సమీపంలో ఓ కల్వర్టు కింద రిమోట్ కంట్రోల్‌తో పేల్చేలా 50 కిలోల ఐఈడీని అమర్చారు. సీఆర్పీఎఫ్ 168వ బెటాలియన్‌కు చెందిన బాంబ్‌స్క్వాడ్ బృందం గురువారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించింది. కల్వర్ట్ కింద కాంక్రీట్‌ను తొలగించి, ఓ బొరియగా మార్చి, అందులోనే ఐఈడీని అమర్చడంతో తొలగింపు సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు. దాంతో.. మరో బాంబును పెట్టి.. ఆ ఐఈడీని పేల్చేసినట్లు తెలిపారు. దీని వల్ల కల్వర్ట్ దెబ్బతిన్నదని, మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు. కాగా.. సుకుమా జిల్లా మెట్టగూడ-దూలేడ్ గుట్టల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను బలగాలు గుర్తించాయి. గ్యాస్ సిలిండర్లు, బీజీఎల్స్ తయారీ పరికరాలు, మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు వెల్లడించాయి.
Updated Date - Jan 24 , 2025 | 05:04 AM