Sajjan Kumar: సిక్కుల ఊచకోత కేసు.. సజ్జన్‌కు యావజ్జీవం
ABN, Publish Date - Feb 26 , 2025 | 05:05 AM
ఈ మేరకు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. మాజీ ప్రధాని ఇందిర హత్య అనంతరం జరిగిన అల్లర్లలో 1984 నవంబరు ఒకటో తేదీన జశ్వంత్ సింగ్ ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌లను హత్య చేయించారంటూ ఆయనపై కేసు నమోదయింది.
కాంగ్రెస్ మాజీ ఎంపీకి ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు
మరణ శిక్ష విధించాలని సిక్కుల డిమాండ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: నాలుగు దశాబ్దాల నాటి సిక్కు ల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ దోషి అని ప్రకటించిన ప్రత్యేక కోర్టు మంగళవారం ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. మాజీ ప్రధాని ఇందిర హత్య అనంతరం జరిగిన అల్లర్లలో 1984 నవంబరు ఒకటో తేదీన జశ్వంత్ సింగ్ ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌లను హత్య చేయించారంటూ ఆయనపై కేసు నమోదయింది. ఇలాంటి నేరాలకు గరిష్ఠంగా మరణశిక్ష, కనిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అల్లర్లలో ఆయన ఒక్కడే పాల్గొనలేదని, కానీ అల్లరి మూకకు అతడే నాయకత్వం వహించాడని కోర్టు గుర్తించింది. సిక్కులపై జరిగిన దాడులకు సంబంధించి నానావతి కమిషన్ దర్యాప్తు చేసింది. మొత్తం 2,733 మంది మరణించగా 587 కేసులు నమోదయ్యాయి. నిందితుల ఆచూకీ దొరకకపోవడంతో 240 కేసులను మూసివేశారు. 250 కేసుల్లో నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు.
400 మందిని దోషులుగా కోర్టులు గుర్తించాయి. హత్యానేరం చేసినట్టు 50 మందిని శిక్షించగా వారిలో సజ్జన్ కుమార్ ఒకరు కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన తిహాడ్ జైలులో ఉన్నారు. మరోవైపు దీనిని అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసుగా పరిగణించి మరణశిక్ష విధించాలని డిమాండు చేస్తూ కోర్టు బయట సిక్కులు ప్రదర్శన జరిపారు. తీర్పుపై బీజేపీ ఐ.టి.విభాగం అధిపతి అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్టు పెడుతూ ‘‘రాజీవ్, సోనియాల ప్రధాన అనుచరుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసులోని ఇతర వ్యక్తులకు కూడా ఇదే గతి పడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో జగదీష్ టైట్లర్ కూడా నిందితుడిగా ఉన్నారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News
Updated Date - Feb 26 , 2025 | 05:05 AM