ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: హస్తం హ్యాట్రిక్‌ ‘సున్నా’

ABN, Publish Date - Feb 09 , 2025 | 05:04 AM

అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారీ ఖాతా తెరవలేక ‘సున్నా’ల హ్యాట్రిక్‌ నమోదు చేసింది. అంతేకాదు.. 2014 నుంచి మూడుసార్లు పార్లమెంటు ఎన్నికల్లోనూ సీట్లు గెలవలేక చతికిలబడింది.

మూడోసారీ ఢిల్లీలో ఖాతా తెరవని కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: గతమెంతో ఘనకీర్తి కలిగిన కాంగ్రె్‌సకు ఢిల్లీలో మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారీ ఖాతా తెరవలేక ‘సున్నా’ల హ్యాట్రిక్‌ నమోదు చేసింది. అంతేకాదు.. 2014 నుంచి మూడుసార్లు పార్లమెంటు ఎన్నికల్లోనూ సీట్లు గెలవలేక చతికిలబడింది. దీంతో.. ఒకప్పుడు వరుసగా మూడుసార్లు గెలిచి 15 ఏళ్లపాటు ఢిల్లీని ఏలిన హస్తం పార్టీ ఇంతటి దయనీయ స్థితికి దిగజారడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. దేశ రాజధానిలో పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది. 1998లో తొలిసారి ఢిల్లీలో గెలుపొందిన కాంగ్రెస్‌.. ఆ తరువాత వరుసగా 2003, 2008 ఎన్నికల్లో నాటి సీఎం షీలా దీక్షిత్‌ సారథ్యంలో విజయం సాధించింది. అప్పట్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండడం కూడా ఢిల్లీలో కాంగ్రె్‌సకు కలిసివచ్చింది. అయితే 2013లో ప్రభుత్వ వ్యవస్థల్లో వేళ్లూనుకుపోయిన అవినీతిని ప్రశ్నిస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఏర్పాటు చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. కాంగ్రె్‌సకు సవాలు విసిరింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆప్‌ దెబ్బకు కాంగ్రెస్‌ 43 సీట్ల నుంచి 8 సీట్లకు పడిపోయింది. ఓటింగ్‌ శాతం కూడా 40.31 నుంచి 24.55 శాతానికి దిగజారింది. అనంతరం 2015 ఎన్నికల్లో ఈ పరిస్థితి మరింత దిగజారి ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. 2020 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఆప్‌ వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. తాజా ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ విషయంలో ఫలితం మాత్రం మారలేదు.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 05:05 AM