ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu Naidu: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సక్సెస్‌!

ABN, Publish Date - Feb 09 , 2025 | 05:00 AM

కూటమి అభ్యర్థి సంజయ్‌ గోయెల్‌ విజయం సాధించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన తన సమీప ప్రత్యర్థి జితేందర్‌సింగ్‌పై 5,178 ఓట్లతో సంజయ్‌ గోయెల్‌ విజయం సాధించారు.

షహదారాలో బీజేపీ అభ్యర్థి విజయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతుగా సీఎం చంద్రబాబు చేసిన ప్రచారం సక్సెస్‌ అయ్యింది. షహదారా నియోజకవర్గంలో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో కలిసి చేసిన ప్రచారం బీజేపీకి లాభించింది. కూటమి అభ్యర్థి సంజయ్‌ గోయెల్‌ విజయం సాధించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన తన సమీప ప్రత్యర్థి జితేందర్‌సింగ్‌పై 5,178 ఓట్లతో సంజయ్‌ గోయెల్‌ విజయం సాధించారు. కాగా, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికలలో షహదారాలో ఆప్‌ విజయం సాధించింది. ఈసారి మాత్రం చంద్రబాబు ఎన్నికల రంగంలో దిగడంతో ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న తెలుగు ప్రజలు బీజేపీకే పట్టంకట్టారు. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రచారం చేసిన త్రీనగర్‌లో బీజేపీ అభ్యర్థి తిలక్‌రామ్‌ గుప్తా సుమారు 16 వేల ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థిపై విజయం సాధించారు.

ప్రజల నమ్మకాన్ని కేజ్రీ వమ్ము చేశారు: పెమ్మసాని

ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని, దాని ఫలితమే ఢిల్లీ తీర్పు అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. ‘అవినీతి పార్టీలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ, జైలు పార్టీలకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు’ అని మరో కేంద్ర మంత్రి మరో మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఢిల్లీ బీజేపీ అఖండ విజయం ప్రధాని మోదీపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ అన్నారు.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 05:00 AM