ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SFJ: సిక్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థపై మరో ఐదేళ్లు నిషేధం

ABN, Publish Date - Feb 01 , 2025 | 04:54 AM

ఎస్‌ఎ్‌ఫజేపై ఇప్పటికే ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ కేంద్రం ఓ గెజిట్‌ను విడుదల చేసింది. దీంట్లో ఆ సంస్థ కార్యకలాపాలను వివరించింది.

న్యూఢిల్లీ, జనవరి 31: భారతదేశ విచ్ఛిన్నం కోసం ముస్లింలు, క్రైస్తవులు, తమిళులను ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ ‘సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌’ (ఎస్‌ఎఫ్‌జే) రెచ్చగొడుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎస్‌ఎ్‌ఫజేపై ఇప్పటికే ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ కేంద్రం ఓ గెజిట్‌ను విడుదల చేసింది. దీంట్లో ఆ సంస్థ కార్యకలాపాలను వివరించింది. ‘మణిపూర్‌లో క్రైస్తవులను ప్రత్యేక దేశం కోసం, తమిళనాడు ప్రజల్ని ద్రవిడిస్థాన్‌ కోసం, ముస్లింలను ఉర్దిస్థాన్‌ కోసం ఎస్‌ఎ్‌ఫజే రెచ్చగొడుతోంది. ఈ కుట్రలో తమతో కలిసి రావాలంటూ దళితులకూ పిలుపునిస్తోంది. మద్ద తు ధరలపై పంజాబ్‌, హరియాణా రైతులనూ ఈ సంస్థే రెచ్చగొడుతోంది’ అని పేర్కొంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌లకు ఎస్‌ఎ్‌ఫజే నుంచి ముప్పు పొంచి ఉందని తెలిపింది. కాగా, మణిపూర్‌లో కుకీ తదితర గిరిజన జాతుల హక్కుల కోసం పోరాడుతున్న ‘నార్త్‌ అమెరికన్‌ మణిపూర్‌ ట్రైబల్‌ అసోసియేషన్‌’ వర్గాలు ఈ గెజిట్‌ను తీవ్రంగా ఖండించాయి.


ఇవి కూడా చదవండి

PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్

Parliament: శీతాకాల సభల్లో సెగలే!

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 04:54 AM