ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Census: ఈ ఏడాదీ జనాభా లెక్కలు లేనట్లేనా?

ABN, Publish Date - Feb 02 , 2025 | 04:42 AM

2025-26 బడ్జెట్‌లో జనాభా లెక్కల కోసం కేవలం రూ. 574.80 కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి రూ. 12,000 కోట్లకు పైగా ఖర్చుతో 2021లో జనాభా లెక్కలు చేపట్టేందుకు, జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)ను నవీకరించేందుకు 2019లో కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర బడ్జెట్‌లో స్వల్పంగా కేటాయింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే ఈ ఏడాది కూడా జనాభా లెక్కలు ఉండకపోవచ్చనే విషయం స్పష్టమవుతోంది. 2025-26 బడ్జెట్‌లో జనాభా లెక్కల కోసం కేవలం రూ. 574.80 కోట్లు మాత్రమే కేటాయించారు. నిజానికి రూ. 12,000 కోట్లకు పైగా ఖర్చుతో 2021లో జనాభా లెక్కలు చేపట్టేందుకు, జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)ను నవీకరించేందుకు 2019లో కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్‌ - సెప్టెంబరు మధ్య దానిని పూర్తి చేయాల్సి ఉన్నా.. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆ నిర్ణయం వాయిదా పడింది. 2021-22 బడ్జెట్‌లో రూ. 3,768 కోట్లు కేటాయింపుతో పోలిస్తే గతేడాది బడ్జెట్‌లో కేటాయింపులు గణనీయంగా తగ్గిపోయాయి.

2024-25 బడ్జెట్‌లో రూ. 572 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక ఈ బడ్జెట్‌లో కూడా నామమాత్రంగా నిధులివ్వడంతో ఈ ఏడాది కూడా జనాభా లెక్కల ప్రక్రియ ముందుకెళ్లే పరిస్థితి లేదని జనాభా లెక్కల అధికారి ఒకరు చెప్పారు. ఈసారి డిజిటల్‌ విధానంలో జనాభా లెక్కలు నిర్వహించడానికి ఎన్యూమరేషన్‌ పోర్టల్‌ సిద్ధం చేశామని, దీనిలో ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఆ పోర్టల్‌ను అధికారికంగా ఇంకా ప్రారంభించాల్సి ఉందన్నారు.


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 04:42 AM