Canada Immigration: ఉపాధ్యాయులకు ఆహ్వానం.. విద్యార్థులకు తిరస్కారం మారిన కెనడా వలస విధానం
ABN, Publish Date - Mar 03 , 2025 | 02:20 AM
విద్యా వ్యవస్థలో ఖాళీల భర్తీ కోసం మరింత మంది టీచర్లు, సహాయక సిబ్బందిని దేశంలోకి రప్పించాలని కెనడా భావిస్తోంది. నిపుణులను దేశంలోకి ఆహ్వానించే ప్రాధాన్యతా వృత్తుల జాబితాను గత గురువారం నవీకరించింది.
న్యూఢిల్లీ, మార్చి 2: కెనడాలో ఉద్యోగం, నివాసం కోరుకుంటున్న భారతీయ ఉపాధ్యాయులకు శుభవార్త. ఐఆర్‌సీసీ(కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వం)లో తాజాగా మార్పులు అలాంటివారికి శాశ్వత నివాసం కల్పించనున్నాయి. విద్యా వ్యవస్థలో ఖాళీల భర్తీ కోసం మరింత మంది టీచర్లు, సహాయక సిబ్బందిని దేశంలోకి రప్పించాలని కెనడా భావిస్తోంది. నిపుణులను దేశంలోకి ఆహ్వానించే ప్రాధాన్యతా వృత్తుల జాబితాను గత గురువారం నవీకరించింది. ఇందులో కొత్తగా టీచర్లు, సహాయక సిబ్బంది, వంటవారిని చేర్చింది. రవాణా రంగాన్ని మొత్తంగా, స్టెమ్ సంబంధిత పలు ఉద్యోగాలను జాబితా నుంచి తొలగించింది. కెనడా విద్యారంగంలో ప్రీ ప్రైమరీ, ప్రాథమిక, సెకండరీ టీచర్లు, సహాయకులు, చిన్నారులకు బోధించేవారు, ప్రత్యేక అవసరాలు గలవారి ఇన్‌స్ట్రక్టర్లను చేర్చారు. అలాగే, మరిన్ని సామాజిక సేవలు, వివిధ టెక్నాలజిస్టులు, టెక్నీషియన్ ఉద్యోగాలతో ఆరోగ్య రంగాన్ని విస్తరించారు.
స్టెమ్ కేటగిరీ నుంచి ఆర్కిటెక్ట్‌లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటి్‌స్టలు, కంప్యూటర్ సిస్టమ్స్ మేనేజర్లు తదితరులను తొలగించి బీమా ఏజెంట్లు, బ్రోకర్లను చేర్చారు. వాణిజ్య కేటగిరిలో వంటవారిని చేర్చారు. రవాణా రంగాన్ని ప్రాధాన్యతా ఎంపికల నుంచి తొలగించారు. అంటే ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టం కింద ఇకపై ట్రక్ డ్రైవర్లు, భారీ పరికరాల ఆపరేటర్లు, విమానయాన పైలట్లను తీసుకోబోరు. మరోవైపు, కెనడాలో ఉన్న 4.23 లక్షల మంది భారతీయుల్లో ఇప్పటికే వేలాదిమంది ముఖ్యంగా విద్యార్థులు నూతన నిబంధనల పట్ల గందరగోళానికి గురవుతున్నారు. డాక్యుమెంటేషన్‌లో స్వల్ప లోపాలతో విద్యాభ్యాసం మధ్యలోనే అనేకమంది విద్యార్థుల స్టడీ పర్మిట్లు రద్దవుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్
PM Modi: 100 జిల్లాల్లో పీఎం ధన ధాన్య కృషి
Privilege Motion: జైశంకర్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Mar 03 , 2025 | 02:20 AM