ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amit Shah : బీజేపీ సైద్ధాంతిక హామీలన్నీ నెరవేర్చాం

ABN, Publish Date - Jan 24 , 2025 | 05:02 AM

బీజేపీ సైద్ధాంతిక హామీలన్నింటినీ మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి సహా హామీలన్నింటినీ నెరవేర్చామని ఆయన చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన హిందూ

ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేశాం: అమిత్‌ షా

అహ్మదాబాద్‌, జనవరి23: బీజేపీ సైద్ధాంతిక హామీలన్నింటినీ మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, ఉమ్మడి పౌరస్మృతి సహా హామీలన్నింటినీ నెరవేర్చామని ఆయన చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన హిందూ ఆధ్యాత్మిక సేవా మేళాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లుగా ప్రభుత్వాలు ముట్టుకునేందుకు కూడా జంకిన హామీలన్నింటినీ మోదీ ప్రభుత్వం పదేళ్లలో పూర్తి చేయగలిగిందన్నారు. మూడో దఫాలోనూ మోదీ ప్రభుత్వం అదే దిశలో వెళ్తుందని చెప్పారు. మోదీ ప్రభుత్వ హయాంలోనే 170కి పైగా దేశాలు యోగాను అంగీకరించాయన్నారు. గతంలో చోరీకి గురైన 350కి పైగా దేవతా విగ్రహాలను ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌కు తీసుకురాగలిగామన్నారు. హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలు అనేక సేవా కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి విద్య, వైద్య సదుపాయాలు అందిస్తున్నాయని, అయితే ప్రచారం మాత్రం చేసుకోలేదని చెప్పారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న హిందూ ధార్మిక సంస్థలను ఒక చోటకు తీసుకురాగలిగిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


అహింసావాదాన్ని కాపాడేందుకు కొన్నిసార్లు హింస అవసరమే: భయ్యాజీ జోషి

అహింసావాదాన్ని కాపాడేందుకు కొన్నిసార్లు హింస అవసరమేనని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ నేత భయ్యాజీ జోషి అన్నారు. హిందువులు తమ ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు ఇతరులు ‘అధర్మం’ అని ముద్ర వేసే పనులు కూడా చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అధర్మాన్ని నిర్మూలించేందుకు పాండవులు కురుక్షేత్రంలో యుద్ధ నియమాలను పక్కనపెట్టారని పేర్కొన్నారు. ‘హిందూ ఆధ్యాత్మిక సేవా మేళా’లో భయ్యాజీ జోషి మాట్లాడారు. ఒక మతం ఇతర విశ్వాసాలను అనుమతించకపోతే శాంతి అనేది ఉండదన్నారు. శాంతిని స్థాపించగల వారికే అందర్నీ కలుపుకొని తీసుకువెళ్లే సామర్థ్యం ఉంటుందని, ఈ విషయంలో మిగతా దేశాలకు సారథ్యం వహించగల దేశం భారత్‌ మాత్రమేనని పేర్కొన్నారు.

Updated Date - Jan 24 , 2025 | 05:02 AM