ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uber Pricing: ఫోన్‌ చార్జింగ్‌ తక్కువగా ఉంటే.. ఉబెర్‌ చార్జీల బాదుడు!

ABN, Publish Date - Jan 21 , 2025 | 03:57 AM

ఉబెర్‌, ఓలా, జెప్టో, బ్లింకిట్‌ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత యాప్‌లు..

ఢిల్లీ ఆంత్రప్రెనర్‌ ప్రయోగంలో వెల్లడి

రెండు ఆండ్రాయిడ్‌, రెండు ఐఫోన్లలో ఒకేసారి ఉబెర్‌ ద్వారా క్యాబ్‌ బుకింగ్‌

బ్యాటరీ తక్కువగా ఉంటే ఎక్కువ ధర

న్యూఢిల్లీ, జనవరి 20: ఉబెర్‌, ఓలా, జెప్టో, బ్లింకిట్‌ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత యాప్‌లు.. వినియోగదారులు వాడే ఫోన్లు, వాటి ఖరీదు ఆధారంగా వస్తు/సేవల ధరలను నిర్ణయిస్తున్నాయన్న ఆరోపణలు చాలాకాలంగానే ఉన్నాయి! తాజాగా ఢిల్లీకి చెందిన రిషభ్‌సింగ్‌ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త.. ఫోన్‌ మోడల్‌తోపాటు, మన ఫోన్‌లో ఉన్న బ్యాటరీ శాతం ఆధారంగా కూడా ఉబెర్‌ ప్రైసింగ్‌ విధానం మారిపోతోందని ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. టెక్‌ ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి ‘ఇంజనీర్‌హబ్‌’ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌పామ్‌ను స్థాపించిన రిషభ్‌సింగ్‌.. ఉబెర్‌ ధరల విధానంపై ఒక ప్రయోగం చేశారు. అందులో భాగంగా రెండు ఆండ్రాయిడ్‌ ఫోన్లు, రెండు ఐఫోన్లలో ఒకే అకౌంట్‌ ద్వారా, ఒకే చోటు నుంచి, ఒకే సమయంలో ఉబెర్‌లోకి లాగిన్‌ అయ్యారు. ఫోన్‌ ప్లాట్‌ఫామ్‌ను (అది ఆండ్రాయిడా, ఐఫోనా అనేదాని) బట్టి 13 నుంచి 50 శాతం దాకా డిస్కౌంట్లు వచ్చాయని.. అంతేకాక, బ్యాటరీ శాతం తక్కువగా ఉన్న ఫోన్లలో ఎక్కువ ధరలు కనిపించాయని ఆయన తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. తన ప్రయోగానికి సంబంధించిన ఫొటోను కూడా షేర్‌ చేశారాయన. అందులో నాలుగు ఫోన్లలో నాలుగు రకాల ధరలు కనిపించడం గమనార్హం. బ్యాటరీ సమాచారం ఆధారంగా ఉబెర్‌ ప్రైసింగ్‌ అల్గారిథమ్‌ వినియోగదారుల అత్యవసర పరిస్థితిని సొమ్ము చేసుకుంటోందని మండిపడ్డారు. ఉబెర్‌, ఓలా వంటి యాప్‌లు తమ ఫోన్‌ ప్లాట్‌ఫామ్‌, బ్యాటరీ స్థాయుల ఆధారంగా ధరలు నిర్ణయిస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని రిషభ్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Jan 21 , 2025 | 03:57 AM