Donald Trump: యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులపై ట్రంప్ వేటు
ABN, Publish Date - Feb 25 , 2025 | 04:37 AM
మిగిలిన వారిలో కొందరిని మినహాయించి మిగతావారందరికీ బలవంతపు సెలవులిచ్చారు. ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను అమెరికా జిల్లా న్యాయమూర్తి జార్జ్ నికోలస్ తోసిపుచ్చారు.
రెండు వేల మంది తొలగింపు
వాషింగ్టన్, ఫిబ్రవరి24: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవల్‌పమెంట్(యూఎస్ ఎయిడ్) సంస్థలో పనిచేసే 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. మిగిలిన వారిలో కొందరిని మినహాయించి మిగతావారందరికీ బలవంతపు సెలవులిచ్చారు. ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను అమెరికా జిల్లా న్యాయమూర్తి జార్జ్ నికోలస్ తోసిపుచ్చారు. ఆ వెంటనే ట్రంప్ సర్కారు ఉద్యోగులను తొలగించే చర్యలు చేపట్టింది. ఇప్పటికే సంస్థకు నిధులను నిలిపివేయడంతో పాటు 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో మిగతా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. యూఎస్ ఎయిడ్ నిధుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకు ఒరిగిందేమీ లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎన్నికల కోసం భారత్‌కు రూ.182 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.251 కోట్లు సాయం చేయడాన్ని ట్రంప్ తప్పుబట్టారు.
ఇవి కూడా చదవండి..
Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Feb 25 , 2025 | 04:37 AM