ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump : ఇజ్రాయెలే మాకు అప్పగిస్తుంది

ABN, Publish Date - Feb 07 , 2025 | 04:40 AM

యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు.

గాజా స్వాధీనంలో మా సైన్యం ప్రమేయం ఉండదు: ట్రంప్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 6: యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్‌ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు. గాజా పునర్నిర్మాణం జరిగే వరకూ సుమారు 2 లక్షల మంది పాలస్తీనీయులను శరణార్థులుగా స్వీకరించాలంటూ ఇటీవల ఈజిప్ట్‌, జోర్డాన్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, యూఏఈ, అరబ్‌లీగ్‌, పాలస్తీనా అథారిటీని ట్రంప్‌ కోరగా.. ఆయా దేశాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని మంగళవారం ఆయన ప్రకటించారు. ఆ ప్రకటనపైనా అరబ్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తమ సైన్యం ప్రమేయం ఉండదంటూ గురువారం ఆయన స్పష్టత ఇచ్చారు.

Updated Date - Feb 07 , 2025 | 04:40 AM