ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Syria: సిరియాలో ఉద్యోగులకు జీతాలు 400% పెంపు

ABN, Publish Date - Jan 07 , 2025 | 05:18 AM

సిరియాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ఆర్థికమంత్రి మొహమ్మద్‌ అబ్జాద్‌ తీపి కబురు చెప్పారు. వచ్చే నెల నుంచి వారి జీతాలను 400ు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు.

డమాస్కస్‌, జనవరి 6: సిరియాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ఆర్థికమంత్రి మొహమ్మద్‌ అబ్జాద్‌ తీపి కబురు చెప్పారు. వచ్చే నెల నుంచి వారి జీతాలను 400ు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు అతి తక్కువగా నెలకు 25 డాలర్ల (రూ. 2,140) జీతం మాత్రమే అందుకున్నారని, దాంతో వారు ఆర్థికంగా తీవ్ర కష్టాలు చవిచూశారని చెప్పారు. ఆర్థిక భద్రతతో పాటు ఉద్యోగుల్లో సమర్థత, జవాబుదారీతనం పెంచడానికి జీతాలను 400ు పెంచుతున్నట్లు తెలిపారు. దీని వల్ల ప్రభుత్వంపై సుమారు వెయ్యి కోట్ల భారం పడుతుందని అంచనా వేశామని చెప్పారు. దీని కోసం పన్నుల విధింపులో మార్పులు చేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. అంతర్యుద్ధం వల్ల సిరియా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అయితే తమ నూతన ప్రభుత్వానికి అరబ్‌ దేశాలు సాయం చేస్తామని హామీ ఇచ్చాయన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 05:18 AM