ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Los Angeles fire : లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు

ABN, Publish Date - Jan 09 , 2025 | 05:54 AM

అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ నగరంలో కార్చిచ్చు చెలరేగింది. హాలీవుడ్‌ నటులు, ప్రముఖులు నివాసం ఉండే అత్యంత సంపన్న ప్రాంతం పసిఫిక్‌ సాలేడ్స్‌ పూర్తిగా మంటల్లో

లాస్‌ ఏంజెలెస్‌, జనవరి 8: అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ నగరంలో కార్చిచ్చు చెలరేగింది. హాలీవుడ్‌ నటులు, ప్రముఖులు నివాసం ఉండే అత్యంత సంపన్న ప్రాంతం పసిఫిక్‌ సాలేడ్స్‌ పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయింది. హాలీవుడ్‌ స్టార్లు టామ్‌ హాంక్స్‌, రీస్‌ విథర్స్పూన్‌ వంటి నటుల ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీనికి తోడు గాలులు బలంగా వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కార్చిచ్చు ఇప్పటికే 3వేల ఎకరాలకు విస్తరించింది. 250 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. 30వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. లాస్‌ఏంజెలె్‌సలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కార్చిచ్చు వల్ల 13వేల భవనాలకు ముప్పు పొంచి ఉందని ఫైర్‌ చీఫ్‌ క్రిస్టిన్‌ క్రౌలీ చెప్పారు. కాగా, పాలిసేడ్స్‌ నుంచి బయటపడటానికి ఒక్క రోడ్డు మార్గమే ఉంది. వందల సంఖ్యలో ప్రజలు కార్లల్లో తరలిపోయేందుకు ప్రయత్నించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో, వారు కార్లను అక్కడే వదిలేసి పారిపోయారు.

Updated Date - Jan 09 , 2025 | 05:54 AM