ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hamas : పీఓకేలోకి హమాస్‌ జైషే, లష్కర్‌ నేతలతో కశ్మీర్‌ సంఘీభావ సభలో భేటీ

ABN, Publish Date - Feb 06 , 2025 | 05:00 AM

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌.. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో తొలిసారి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 5వ తేదీని కశ్మీర్‌ సంఘీభావ దినంగా పాకిస్థాన్‌ పాటిస్తుంది. ఈ సందర్భంగా రావల్‌కోట్‌లోని షాహిద్‌ సబీర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌.. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో తొలిసారి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 5వ తేదీని కశ్మీర్‌ సంఘీభావ దినంగా పాకిస్థాన్‌ పాటిస్తుంది. ఈ సందర్భంగా రావల్‌కోట్‌లోని షాహిద్‌ సబీర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో జైషే మహమ్మద్‌(జేఈఎం), లష్కరే తాయిబా(ఎల్‌ఈటీ) ప్రధాన కమాండర్లతోపాటు హమాస్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇరాన్‌లో హమాస్‌ ప్రతినిధి డాక్టర్‌ ఖలీద్‌ అల్‌ ఖుదామీ.. ఈ సమావేశంలో హమా్‌సకు ప్రాతినిధ్యం వహించారు. పీఓకేలో అడుగుపెట్టిన తొలి హమాస్‌ నేతగా నిలిచారు. హమా్‌సతో సంబంధం ఉన్న మరికొందరు పాలస్తీనా నేతలు కూడా ఖలీద్‌ వెంట ఉన్నారు. ఇక, జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌ సోదరుడు తల్హా సైఫ్‌, జైషే కమాండర్లు అస్గర్‌ ఖాన్‌ కశ్మీరీ, మసూద్‌ ఇలియా్‌సతోపాటు లష్కర్‌ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2025 | 05:00 AM