ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold : లండన్‌ నుంచి న్యూయార్క్‌కు బంగారం తరలింపు

ABN, Publish Date - Feb 19 , 2025 | 04:30 AM

లండన్‌లో ఉన్న అమెరికన్‌ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారాన్నంతా న్యూయార్క్‌కు తరలిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన వాణిజ్య యుద్ధమే ఇందుకు కారణం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే

ట్రంప్‌ పన్నులు పెంచుతారన్న భయమే కారణం

లండన్‌, ఫిబ్రవరి 19: లండన్‌లో ఉన్న అమెరికన్‌ బ్యాంకులు తమ వద్ద ఉన్న బంగారాన్నంతా న్యూయార్క్‌కు తరలిస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన వాణిజ్య యుద్ధమే ఇందుకు కారణం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై ట్రంప్‌ పన్నులు విధిస్తారన్న అనుమానాలతో తమ బంగారం నిల్వలను ముందుగానే అమెరికాకు పంపించివేస్తున్నాయి. ఈ కారణంగా లండన్‌లో బంగారం ధర డిసెంబరు నుంచి పోల్చితే 20 డాలర్లు (సుమారు రూ.1800) మేర తగ్గింది. మరో వైపు అమెరికాలో బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. అధ్యక్ష ఎన్నికలు జరిగిన నవంబరు 5 నాటికి బంగారం నిల్వలు 50 బిలియన్‌ డాలర్ల మేర ఉండగా, ప్రస్తుతం 106 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

Updated Date - Feb 19 , 2025 | 04:30 AM