ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Coffee: ఈ సమస్యలుంటే కాఫీ తాగొద్దు!

ABN, Publish Date - Mar 04 , 2025 | 03:34 PM

కాఫీతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు కాఫీ తాగకపోవడమే బెటరని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ సమస్యలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: కాఫీ అంటే ఇష్టపడే వారు కోట్లల్లో ఉంటారు. కాఫీ ఆరోగ్యానికి మంచిదని కూడా డాక్టర్లు చెబుతారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు కాఫీ తాగకూడదు. మరి ఇది ఎవరికి నిషిద్ధమూ ఈ కథనంలో తెలుసుకుందాం (Who should not drink coffee).

నిపుణులు చెప్పే దాని ప్రకారం, కాఫీ పరిమితంగా తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 40 వేల మందిపై దశాబ్దం పాటు జరిపిన ఓ ఒకానొక అధ్యయనం కాఫీతో లాభాల్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. రోజూ ఓ కాఫీ తాగే వారిలో గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం 31 శాతం తక్కువ అని తేలింది. ఇతరత్రా అనారోగ్య కారణాలతో మరణించే ప్రమాదం కూడా 16 శాతం మేర తగ్గింది. కాఫీలోని ఫినాలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ డయాబెటిస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక రోగాల నుంచి రక్షణనిస్తాయి. కాబట్టి, ఉదయాన్నే తాగే కాఫీతో కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.


Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!

కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రం కాఫీ తాగకపోవడమే బెటర్.

  • ఉదాహరణకు ఆందోళన, నిద్రలేమి ఉన్న వారు కాఫీ తాగితే సమస్యలు మరింత పెరుగుతాయి.

  • హైబీపీ ఉన్న వాళ్లు కూడా కాఫీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కాఫీ వల్ల బీపీ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది.

  • కడుపుతో ఉన్న మహిళలు కూడా కాఫీ పరిమితంగానే తాగాలి. అతిగా కాఫీ తాగితే గర్భస్థ శిశువు ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.

  • కొందరికి కాఫీలోని కెఫీన్ అస్సలు పడదు. మరికొందరికి మైగ్రేన్ మొదలువుతంది. ఇలాంటి వారు కూడా కాఫీని పరిమితంగానే తాగాలి.

  • ఐబీఎస్, ఐబీడీ లాంటి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా కాఫీకి దూరంగా ఉండాలి.


కాఫీతో తక్షణ శక్తి లభించినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అతిగా కాఫీ తాగితే.. ఐరన్ గ్రహించడంలో పేగులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఫలితంగా ఎముకులు పెళుసుబారడం, చిన్నతనంలో వృద్ధాప్య లక్షణాలు, ఆందోళన, నిద్రలేమి వంటివి వస్తాయి.

ఇక బ్లాక్ కాఫీ మంచిదా లేక పాలు కలిపిన సాధారణ కాఫీ మంచిదా అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే, పోషకాలు కోరుకునే వారు డికాషన్‌కు కాస్త పాలు జత చేస్తే ప్రొటీన్లు, కాల్షియం కూడా అందుతుందని చెబుతున్నారు. అయితే, ఉదయం 9.30 నుంచి 11.30 మధ్య కాఫీ తాగేందుకు అత్యంత అనుకైలమైన సమయమని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి కాబట్టి శరీరాన్ని ఓ మోస్తరు స్థాయిలో ఉత్తేజితం చేసేందుకు కాఫీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం 3 దాటాక కాఫీ తాగితే ఆ రాత్రి సీలింగ్ వైపు చూస్తూ గడపాల్సిందేనని, నిద్రకు దూరమవుతారని హెచ్చరిస్తున్నారు.

Read Latest and Health News

Updated Date - Mar 04 , 2025 | 03:34 PM