Viral: ఓ బ్లడ్ గ్రూప్స్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ABN, Publish Date - Jan 04 , 2025 | 08:19 AM
ఓ బ్లడ్ గ్రూప్స్ గురించి మీకు తెలీని కొన్ని ఆసక్తికర విషయాలు ఇవే
ఇంటర్నెట్ డెస్క్: అధిక శాతం మంది మనుషులకు ఓ బ్లడ్ గ్రూప్ రక్తం ఉంటుంది. ఇది రెండు రకాలు.. ఒకటి ఓ పాజిటివ్, రెండోది ఓ నెగెటివ్. ప్రపంచంలో ఏకంగా 38 శాతం మందికి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అయితే, ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూపు ఉన్న వారు మాత్రం కాస్త అరుదనే చెప్పాలి. ప్రతి ఏడుగురిలో ఒక్కరికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది.
రక్తంలో ఏయే యాంటీజెన్లు, యాంటీబాడీలు ఉన్నాయనే దాన్ని బట్టి బ్లడ్ గ్రూప్ ఆధారకపడి ఉంటుంది. ఓ బ్లడ్ గ్రూపు వారి ఎర్రరక్తకణాలపై ఎటువంటి యాంటీజెన్లు ఉండవు. కానీ వారి ప్లాస్మాలో మాత్రం యాంటీ ఏ, యాంటీ బీ యాంటీబాడీలు ఉంటాయి (Health).
Smoking: రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదని అనుకుంటున్నారా? ఇది ఎంతటి ప్రమాదమో తెలిస్తే..
నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఎక్కువ డిమాండ్ ఉన్న బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్. ఇది ఏ పాజిటివ్, బీ పాజిటివ్, ఓ పాజిటివ్, ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూపులకు ఇది తగినది. ప్రపంచంలో 80 శాతం మందికి పాజిటివ్ బ్లడ్ గ్రూపే ఉంటుంది. అందుకే ఈ బ్లడ్ గ్రూపుకు డిమాండ్ ఎక్కువ. అత్యవసర సమయాల్లో ఈ బ్లడ్ గ్రూప్ కే తొలుత కొరత ఏర్పడుతుంది. యాక్సిడెంట్లు, ఇతర ప్రమాదాల్లో బాధితుల బ్లడ్ గ్రూప్ ఏదో తెలీని అత్యవసర సందర్భాల్లో ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌నే ఇస్తారు. దీని వల్ల రియాక్షన్లు పరిమితంగా ఉండటంతో దీన్ని ఎంచుకుంటారు. ఇక సీఎమ్‌వీ నెగెటివ్ ఉన్న ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వారిని హీరో ఫర్ ది బేబీస్ అని అంటారు. రోగనిరోధక శక్తి లేని నవజాత శిశువులకు అత్యంత భద్రమైన బ్లడ్ గ్రూప్ ఇదే.
Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!
ఇక ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని సార్వత్రిక డోనర్లుగా పిలుస్తారు. వీరి రక్త కణాలపై ఏ,బీ, ఆర్‌హెచ్ యాంటీజెన్లు లేకపోవడమే ఇందుకు కారణం. యాంటీజెన్లు లేని కారణంగా ఈ రక్తాన్ని ఏ, బీ, ఏబీ, ఓ బ్లడ్ గ్రూపుల వారికి ఇవ్వొ్చ్చు. అయితే, ఏ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ వారికి కేవలం ఓ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ రక్తాన్నే ఎక్కించాలనేది నిపుణులు చెప్పే మాట.
Updated Date - Jan 04 , 2025 | 09:49 AM