ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Signs of Heart Disease In Legs: కాళ్లల్లో ఈ మార్పులు గుండె జబ్బులకు సంకేతం

ABN, Publish Date - Mar 06 , 2025 | 05:38 PM

కాళ్లల్లో కనిపించే కొన్ని మార్పులు గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సంకేతాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: కాళ్ల నొప్పులంటే ప్రతి సారీ అధిశ్రమ, కండరాలపై ఒత్తిడి కారణంగా వచ్చేవిగా భావించొద్దని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం కాళ్ల నొప్పులు వేధిస్తున్నాయంటే అంతర్లీనంగా పెద్ద సమస్య ఉన్నట్టు అనుమానించాలని సూచిస్తున్నారు. కాళ్ల నొప్పులే కదా అని నిర్లక్ష్యం చేస్తే ముందస్తుగా వ్యాధిని గుర్తించే అమూల్యమైన అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు. తరచూ కాళ్లల్లో నొప్పులు, రోజురోజుకూ నొప్పి తీవ్రమవడం వంటివి కాళ్లల్లో రక్తప్రసరణ తగ్గిందనేందుకు ఒక సూచన. ఇది హార్ట్ఎటాక్‌‌కు ముందస్తు సంకేతం కూడా అయ్యండొచ్చని అనుభవజ్ఞలు చెబుతున్నారు. కాబట్టి కాళ్లల్లో కనిపించే కొన్ని మార్పులను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం (5 Warning Signs In Your Legs Indicating Heart Disease)


Green Grapes Vs Black Grapes: ఆకుపచ్చ ద్రాక్ష, నల్ల ద్రాక్ష.. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏటంటే..

అకారణంగా కాళ్లల్లో నొప్పులు వస్తున్నాయంటే రక్త ప్రసరణలోపం ఉన్నట్టు భావించాలి. రక్త ప్రసరణకు అంతర్లీనంగా ఏదో అడ్డుపడుతున్నట్టు అనుమానించాలి. ఇలాంటి సమస్యను తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే రాబోయే ప్రమాదాన్ని సులువగా నివారించొచ్చు.

నడక లేదా కసరత్తులు చేసే సమయంలో నొప్పి అనిపిస్తు రక్త ప్రసరణకు అడ్డంకులు ఉన్నాయనేందుకు ఒక సంకేతం. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తెల్తుతుంది. ఆర్టరీల్లో అడ్డంకులకు ఇదో సూచన అని నిపుణులు చెబుతున్నారు.

కాళ్ల లొప్పులతో పాటు ఛాతిలో నొప్పిగా ఉంటే కరోనరీ ఆర్టరీలో సమస్యగా అనుమానించాలి. ఇలాంటి సందర్భాల్లో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువ.


Coffee: ఈ సమస్యలుంటే కాఫీ తాగొద్దు!

ఇక కాళ్లల్లో నిత్యం నొప్పి వస్తోందంటే రక్త ప్రసరణలో లోపం ఉన్నట్టే. ఇది గుండె సంబంధిత సమస్యలు, లేదా రక్తనాణాల్లో క్లాట్స్‌కు ఒకానొక సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యవసరం.

అలసటతో పాటు శ్వాస అందకపోవడం, కాళ్ల నొప్పులు వంటివన్నీ గుండె సంబంధిత సమస్యలకు సంకేతం. ఇలాంటి పరిస్థితిని ఎదురైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించకపోతే గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తెచ్చుకున్నట్టు అవుతుంది.

ఇక గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు క్రమతప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Coconut water High Potassium: కొబ్బరి నీళ్లతో ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి జాగ్రత్త!

Read Latest and Health News

Updated Date - Mar 06 , 2025 | 05:38 PM