ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 3 02 2025

ABN, Publish Date - Feb 03 , 2025 | 06:26 AM

గంటా కమలమ్మ పురస్కారం, కథా సంపుటాలకు ఆహ్వానం, కథా గౌరవ సభ, బౌద్ధ కథలు కావాలి...

గంటా కమలమ్మ పురస్కారం

గంటా కమలమ్మ సాహితీ పురస్కార ప్రదాన సభ ఫిబ్రవరి 8 ఉ.10గంటలకు, చిత్తూరు లోని, విజయం డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో జరుగుతుంది. ‘నాలుగు రెక్కల పిట్ట’ కవితా సంపుటానికి గాను సాంబమూర్తి లండ, ‘చింతల తొవ్వ’ కవితా సంపుటికి గాను తుల శ్రీనివాస్ పదివేల రూపాయల నగదు, జ్ఞాపికతో పురస్కారాన్ని స్వీకరిస్తారు.

గంటామోహన్

కథా గౌరవ సభ

మధునాపంతుల వేంకటేశ్వర్లు (మధుశ్రీ) కథా గౌరవ సభ ఫిబ్రవరి 9ఉ.10గంటలకు కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో జరుగుతుంది. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, కాళ్ళకూరి శైలజ కథా గౌరవ పురస్కారాలను స్వీకరిస్తారు. అధ్యక్షత మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, పురస్కార స్వీకర్తల పరిచయం– బీకేఎస్‌ రాజా, వసుధా రాణి, కె. రామచంద్రారెడ్డి. వివరాలకు 9704186544.

మధునాపంతుల కిరణ్‌


బౌద్ధ కథలు కావాలి

తెలుగులో బౌద్ధం నేపథ్యంగా వచ్చిన కథలను ‘మహాబోధి’ పేరుతో సంకలనంగా తెస్తున్నాము. మీరు రాసిన, లేక మీకు తెలిసి పత్రికలలో ప్రచురితమైన బౌద్ధ కథలను, లేదా వాటి వివరాలను పరిశీలన కోసం పంపవలసిందిగా మనవి. జాతక కథలు కాకుండా, బుద్ధుడు చెప్పిన కథలు కాకుండా– చారిత్రక నేపథ్యం లేదా ఆధునిక జీవితంలో బౌద్ధాన్ని అన్వయించి రాసిన కథలు మాత్రమే కావాలి. వీటిని ఫిబ్రవరి 10లోపు ఈమెయిల్: mahabodhi2025@gmail.comకు పంపాలి.

బోధి ఫౌండేషన్

కథా సంపుటాలకు ఆహ్వానం

తపన సాహిత్య వేదిక మొదలై 34ఏళ్లు కావ స్తున్న సందర్భంగా ప్రతి ఏటా ఉత్తమ కథల సంపుటాలకు రు.10వేల బహుమతితో ‘సడ్లపల్లె కథా పురస్కారం’ ఇవ్వాలని నిర్ణయించారు. జనవరి 2023 నుంచి డిశంబర్ 2024 మధ్యలో ప్రచురితమైన కథా సంపుటాలు నాలుగు ప్రతు లను మార్చి 31 లోపు చిరునామా: సడ్లపల్లె చిదంబరరెడ్డి, 21.6.139, టీచర్స్ కాలనీ, హిందూ పురం – 515 211, ఫోన్‌: 94400 73636 కు పంపాలి.

తపన సాహిత్య వేదిక

Updated Date - Feb 03 , 2025 | 06:26 AM