తెగిన గొలుసుల చప్పుడు
ABN, Publish Date - Mar 10 , 2025 | 01:08 AM
పాత కాగితాలపై ఎప్పుడో రాసిన పద్యాలు ఛందస్సులో తెగిన గొలుసుల చప్పుడు తుప్పుపట్టిన తీగలపై మోగుతున్న సంగీతం చెదలు పట్టిన పుటల్లో...
పాత కాగితాలపై
ఎప్పుడో రాసిన పద్యాలు
ఛందస్సులో తెగిన
గొలుసుల చప్పుడు
తుప్పుపట్టిన తీగలపై
మోగుతున్న సంగీతం
చెదలు పట్టిన
పుటల్లో
అరిగిపోయిన శబ్దాలు
సడలిపోతున్న పిడికిళ్లపై
పెరిగిపోతున్న ముడతలు
బావుల్లాంటి కళ్లలో
ఇంకిపోయిన అశ్రువులు
రాలిపడుతున్న ఆకులతో
పోటీపడుతున్న శవాలు
ఎవరంతటవారు బూడిద
రాసుకుంటే
ఎవరికో ఎందుకు
తన్మయత్వం
ఎవరో ఆత్మాహుతి
చేసుకున్నారని తెలిస్తే
ఇంకెవరికెందుకో
దగ్ధ విషాదం
ప్రతి ముఖంలో ఉన్మాదం
ప్రతి కళ్లలో రక్తరేఖలు
చితుల వెలుగులో
సూర్యుడ్ని
చూడాలనుకోవడం భ్రమ
అస్తమయాలన్నీ
ఉదయాలు
అవుతాయనుకోవడం
అశాస్త్రీయం
ఎవరి తలపై
ఆకాశం వారిదే
పయనించే మేఘాలే
గగనాన్ని
శోభితం చేస్తాయి
కృష్ణుడు
For Telangana News And Telugu News
Updated Date - Mar 10 , 2025 | 01:08 AM