ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్యంగస్ఫూర్తిని చాటే రేడియో కవి సమ్మేళనం

ABN, Publish Date - Jan 24 , 2025 | 06:01 AM

ఆకాశవాణి 1956 నుంచి నిర్వహిస్తూ వస్తున్న సర్వ భాషా జాతీయ కవి సమ్మేళనం విలక్షణమైనది. రాజ్యాంగ స్ఫూర్తికి, భిన్నత్వంలో ఏకత్వం అనే భావానికి ప్రతిరూపంగా, తనదైన శైలిలో అన్ని భాషల...

ఆకాశవాణి 1956 నుంచి నిర్వహిస్తూ వస్తున్న సర్వ భాషా జాతీయ కవి సమ్మేళనం విలక్షణమైనది. రాజ్యాంగ స్ఫూర్తికి, భిన్నత్వంలో ఏకత్వం అనే భావానికి ప్రతిరూపంగా, తనదైన శైలిలో అన్ని భాషల కవులను సంవత్సరానికి ఒకసారి ఒకే వేదిక మీద కలిపే అపూర్వ సందర్భమిది. ప్రతి ఏటా 23 భాషల్లో ఒక్కో కవిని ఎంపిక చేసి, అందరి కవితలనూ అన్ని భాషలలోకి అనువదించి జనవరి 25 రాత్రి పది గంటలకు దేశం లోని అన్ని కేంద్రాల ద్వారా ప్రసారం చేయటం ఆనవాయితీ. మరుసటి రోజు అంటే దేశ రిపబ్లిక్ దినోత్సవం నాడు మరోసారి అన్ని కేంద్రాలు వారి వీలును బట్టి ప్రసారం చేస్తాయి. ఇలా ఏ ప్రసార మాధ్యమంలోనూ జరుగదు. కవులను ఒకే వేదిక మీదకు తీసుకురావటం వల్ల వారి వారి భావాలను, ఆలోచనలను పంచుకోవడానికి వీలుకలుగుతుంది. భిన్న ప్రాంతాల ఆచార సంప్రదాయ సాంస్కృతిక రంగాల అంశాలను కలబోసుకునే అద్భుత అవకాశం ఉంటుంది. ఒక సమైక్య సమభావం బలపడుతుంది.


ఆకాశవాణి 2025 సర్వ భాషా జాతీయ కవి సమ్మేళనానికి ముంబై ఆకాశవాణి కేంద్రం వేదిక అయ్యింది. ఈ కార్యక్రమంలో తెలుగు భాష నుంచి ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం తన 75 ఏళ్ళ చరిత్రలో 2014లో ఈ సర్వ భాషా జాతీయ కవి సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించింది. ప్రతి కవికి ఈ సమ్మేళనంలో పాల్గొనాలనే కోరిక ఉండటం సహజం. అవకాశం వచ్చినవారు గౌరవంగా, కొంచెం గర్వంగా అనుభూతి పొందుతారు కూడా. ఎవ్వరూ దీనికి అతీతులు కాకపోవచ్చు. ఇతర భాషల కవితలను అనువాదం చేయటం కూడా కత్తి మీద సాము లాంటిది. కవిత్వంలో, అనువాదంలో లబ్దప్రతిష్టులతో ఈ పని పూర్తిచేయటం కూడా బృహత్ కార్యక్రమమే. ఈ సంవత్సరం ముకుంద రామారావు, మందలపర్తి కిషోర్, నందిని సిధారెడ్డి, కొలకలూరి ఇనాక్, అమ్మంగి వేణుగోపాల్, యార్లగడ్డ రాఘవేంద్ర రావు, సుమనస్పతి రెడ్డి, సమ్మెట నాగమల్లేశ్వరరావు, నాళేశ్వరం శంకరం, సుధామ, యాకుబ్, శిలా లోలిత, చిల్లర భవానిదేవి, మామిడి హరికృష్ణ, ఐనంపూడి శ్రీలక్ష్మి, దర్భశయనం శ్రీనివాసాచార్య, తాడేపల్లి పతంజలి, అనంత పద్మనాభరావు, జింబో (మంగారి రాజేందర్‌) తదితరులు వివిధ భాషల కవితలను తెలుగులోకి అనువాదం చేశారు. వీరందరినీ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి సత్కరించి, వారి అనువాదాలను వారితోనే చదివించి రికార్డు చేసింది. ఈ మహత్తర కార్యక్రమం ప్రోగ్రామ్‌ హెడ్ కొమ్మారెడ్డి లక్ష్మీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో సుంకసరి రమేష్, అవధానులు శ్రీహరి, సందీప్‌ల బృందం పూర్తి చేసింది.


గత నాలుగైదు సంవత్సరాలుగా నాకు కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశం దొరికింది. ఇతర భాషలలో కంటే తెలుగులోనే ప్రయోగాలు ఎక్కువగా కనిపించాయి. తెలుగు భాష కవిత్వంలోనే సామాజిక సంక్షోభాలు, మానవ సంబంధాలు, సమకాలీన మానసిక జీవన సంఘర్షణలు ఇలా ఎన్నో ఎన్నెన్నో అంశాలు గురించి కవుల మథనం స్పష్టంగా కనిపించింది. అయితే మన వారి కవిత్వం ఇతర భాషల్లోకి పెద్దగా తర్జుమా అవుతున్నట్లు లేదు. ఇది బాగా లోటు అనిపిస్తోంది. ప్రస్తుత కాలంలో ఆకాశవాణి నిర్వహిస్తున్న సర్వ భాషా జాతీయ కవి సమ్మేళనం సాహిత్య అభిలాషులకు, అభిమానులకు ఎడారిలో ఒయాసిస్సు వంటిందని చెప్పటానికి సందేహించవలసిన అవసరం లేదు.

వలేటి గోపీచంద్

ఆకాశవాణి విశ్రాంత అధికారి

Updated Date - Jan 24 , 2025 | 06:01 AM