ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముద్దులు

ABN, Publish Date - Feb 10 , 2025 | 06:41 AM

ఏటొడ్డున గులాబి వన్నెలో పూసే సముద్ర పాలాకు పూలు. ఒంకిని గుంటలో విరిసే తెల్ల తామరలు నీకు ముద్దు....

ఏటొడ్డున గులాబి వన్నెలో పూసే సముద్ర పాలాకు పూలు. ఒంకిని గుంటలో విరిసే తెల్ల తామరలు నీకు ముద్దు.

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతరలో

తీసిచ్చిన బంగారు చుక్కల నీలపు మట్టి గాజులు. నాయుడుపేటలో కొన్న రవ్వలంత అద్దాలు కుట్టిన చిలకపచ్చ రంగు కెంజాయ అంచు చున్నీ. తూపిలిపాళెం కడలొడ్డున అలలు మనల్ని దొర్లిస్తుండగా దొరికిన పాల తెలుపు చిన్న శంకు నీకు ముద్దు.

నా చేతిపైన మనిద్దరి పేర్ల తొలి అక్షరాల పచ్చబొట్టు. నా ఎడమ చెవికి పెట్టుకున్న తెల్లరాయి పుడక. జడల్లి పూలు పెట్టేదా అంటూ మెడదాకా పెంచుకున్న నా జుట్టులో వేళ్లు జొనిపి సుకుమారంగా గుంజడము. గూడూరు సుందరమహల్లో కలిసి చూసిన చంటి సినిమా ఇలా అప్పట్లో నీకు మన కలయికలోని ప్రతి ఒకటీ ముద్దు.


ఒక నా పుట్టినరోజు సాయంత్రం నుదుటన నువ్విచ్చిన చిన్నప్పటి మా అమ్మ ముద్దు. ఆ రాత్రి చీకటిలో ఏటి ఇసుకపైన నీ నిలువు పెదాలను నా పెదాలకు అప్పగించిన ముద్దు.

రేపట్నుంచి నీకు కనబడనంటూ వెక్కిళ్లతో – గుండెలు పగిలిన కట్టెకు నువ్విచ్చిన చితి కౌగిలి ముద్దు.

కలలన్నీ బూడిదై చివరికి మిగిలిన ఒంటూపిరి బతుక్కి నీ తలపోతల తపనలే కన్నీటి జడిలో విరిసి మెరిసే వానవిల్లు ముద్దు.

ఫిరోజ్‌ చిగురుపాటి


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 10 , 2025 | 06:41 AM