ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలస్వనం

ABN, Publish Date - Feb 17 , 2025 | 12:20 AM

మాట్లాడుకోవాల్సింది చానా వుండి మౌనం సమాధి పలకల సాంద్రమైంది దిగులు చీకటి రెక్క విచ్చుకుని వాలింది ఒంటరి వృక్షం కొమ్మకొమ్మనా...

మాట్లాడుకోవాల్సింది చానా వుండి

మౌనం సమాధి పలకల సాంద్రమైంది

దిగులు చీకటి

రెక్క విచ్చుకుని వాలింది

ఒంటరి వృక్షం కొమ్మకొమ్మనా

జ్ఞాపక పిచుకల పలవరింతలు

సద్దు పరిచే దిమ్మిస చప్పుళ్ళ

విస్కీ వగరు చప్పరింతలు

విఫల యత్నాలు

రేపటి సూర్యుడు

దీప ఖడ్గాన్ని బూని

మిత్రహరితం పొట్లం కట్టి తెచ్చాడు

విప్పదీయ

నిన్న లేనిదేదో వుండి

దినాన్ని దినుసుమీఱ చేస్తుంది

జీవ జవం కూడదీసుకుని

కొత్త చివురు వేయ

పలుకు తీపి పలుకులాయే

మరి

అది

నీతో నువ్వయినా!

పిన్నంశెట్టి కిషన్

& 97002 30310


Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..

Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..

Updated Date - Feb 17 , 2025 | 12:20 AM