జ్ఞాపకాలై పరిమళించే బంధాల కోసం...
ABN, Publish Date - Mar 03 , 2025 | 12:51 AM
గరికపాటి మణిందర్ రాసిన ఈ కవిత వస్తు రూపాల మధ్య మంచి సమన్వయాన్ని సాధించింది. కవిత మొత్తం అంతర్లీ నంగా ఒక సౌందర్యం పాఠకుడి హృదయాన్ని...
గరికపాటి మణిందర్ రాసిన ఈ కవిత వస్తు రూపాల మధ్య మంచి సమన్వయాన్ని సాధించింది. కవిత మొత్తం అంతర్లీ నంగా ఒక సౌందర్యం పాఠకుడి హృదయాన్ని తన లోపల సంలీనం చేసుకుంటుంది. కవితలోని ‘వాక్యా’లని మనుషు లకు ప్రతీకలుగా తీసుకుంటే కవి దేన్ని ఉద్దేశించాడో అర్థం అవుతుంది. స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు ఎంత మంది ఉంటే మాత్రమేమి? వాళ్ళెంత పారదర్శకంగా, ఎంత ఇన్‌స్టంట్ కాఫీ పరిమళంలా వున్నా సరే, హృదయానికి దగ్గరగా వచ్చేవారు చాలా తక్కువమందే. వాళ్ల్లు కొత్తగా కుట్టించుకున్న బట్టలకు రాసిన అత్తరు పసుపు మరకలా మనసుకు అలా కలకాలం పట్టి నిలిచిపోతారు. ఇక్కడ పసుపుకు అత్తరును అద్దటంలో ఉంది కవి చమత్కారం. మామూలుగా కొత్త బట్టలకు పసుపు రాయటం సహజం. కేవలం పసుపు మాత్రమే రాస్తే అది రాలిపోతుంది. అత్తరు అద్దటం వలన అత్తరు లోని తడిలో పసుపు సంగమించి చివరకు మరకగా మిగులుతుంది.
ఆ సహజమైన పసుపుకు అత్తరు అద్ది మరకను సైతం పరిమళభరితం చేస్తున్నాడు. మను షులు ఒకరితో ఒకరు భౌతికంగా కలిసి ఉండటం మాత్రమే కలసి ఉండటం కాదు. భౌతిక మైన మనుషులను మానసికమైన బంధం ఏదో ముడి వేయాలి. ఆ బంధం అత్తరులా పరిమళాలు వెదజల్లాలి. అప్పుడు మనుషులు లేకున్నా బంధాలు జ్ఞాపకాలై పరిమళిస్తాయి.
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా
Updated Date - Mar 03 , 2025 | 12:51 AM