కదలని నేలపై కదిలే నురుగు కెరటాలు
ABN, Publish Date - Jan 27 , 2025 | 01:07 AM
నిండుజీవితానికి సాక్ష్యంగా పండుజుత్తుతో తుదిశ్వాసవిడిచి, దశాబ్దాలుగా మట్టిన నిద్రిస్తున్న తాత, నిలువెత్తు మొలకెత్తి తొంగిచూస్తూ పలకరిస్తున్నట్టు...
నిండుజీవితానికి సాక్ష్యంగా
పండుజుత్తుతో తుదిశ్వాసవిడిచి,
దశాబ్దాలుగా మట్టిన నిద్రిస్తున్న తాత,
నిలువెత్తు మొలకెత్తి
తొంగిచూస్తూ పలకరిస్తున్నట్టు
కట్టెదుట రెల్లుపూలు!
వేడి వేసవి నుండి వరదలతో సేదదీరుతున్న
భూమితల్లికి వీస్తున్న వింజామరల తూలికలు!
ఆకాశమంత వెన్నెల్లో
శరత్కాలమేఘం పచ్చమైదానాన్ని సుతారంగా
ముద్దాడుతున్న వైనం!
అమాసరేయి కదలాడుతూ
భయపెడుతున్న తెల్లసింహాల మంద.
గాలి కదలాడినంతసేపూ
కదలని నేలపై కదిలే నురుగుకెరటాలు!
కనుచూపుమేరా పూచిన తెల్లజెండాలను
ప్రపంచ యుద్ధోన్మాదుల చేతికి
అతికించాలని ఉంది! చాలుతాయో? చాలవో?
గార రంగనాథం
98857 58123
ఈ వార్తలు కూడా చదవండి
Kandukuri Venkatesh: కష్టపడి కాన్వాస్ పెయింటింగ్‌ను చిత్రీకరించాను.
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jan 27 , 2025 | 01:07 AM