ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఊపిరిపాటకు చూపేదీ?

ABN, Publish Date - Mar 10 , 2025 | 01:05 AM

శిల్పాల్నీ, శిథిలాల్నీ సాగరాన్ని, నగరాన్నీ మేల్కొలుపుతూ వినబడ్డాడతను వేకువల్ని వణికించే వేణువుగా....

శిల్పాల్నీ, శిథిలాల్నీ

సాగరాన్ని, నగరాన్నీ

మేల్కొలుపుతూ వినబడ్డాడతను

వేకువల్ని వణికించే వేణువుగా.

గాలి మడుగులో

రాగాల జాడలు పట్టుకుని

వెదుక్కుంటూ వెళ్ళి చూశానతన్ని

చూశానా? కాదు కరుణించి కనబడ్డాడు

పాట ఆపినపుడు

మురళితోబాటు మహాబలిపురాన్నే

సంచిలో పెట్టుకున్నాడా అని?

జలదరించిన ఉదయాలను

సంగీతానికి వదిలి

రాత్రుల్ని కళ్లుగా చేసుకున్నాడా అని?

అడగలేదు... ధ్యానానికి కొనసాగింపు

మౌనమే కావాలని.

బాగా రాత్రయింది, తోడొస్తాను

ఇంటిదాకా అంటే

నిశ్శబ్దంగా నవ్వాడు

చీకటి నా తోబుట్టువని

మీకు తెలీదా? అన్నట్టు

వీడ్కోలు వేళ మాటల్లో మాటగా

రోజూ అడిగినా గుళ్ళోకి రావేమంటే?

పంచేంద్రియాలకు అందని

పరవశంతో గుసగుసగా

‘రగసియం స్వామీ!

ఎనక్కు ఇంగెయే దరిసనమాగుం’

(రహస్యం స్వామీ!

నాకు ఇక్కడే దర్శనమౌతుంది.)

అని నమస్కార ముద్రలో

తడుముకున్నాడు

వేణువు వొంటిపైన తన ఏడు కళ్ళనీ...

స్వాతికుమారి

For Telangana News And Telugu News

Updated Date - Mar 10 , 2025 | 01:05 AM