రేపు ఎఐఎఫ్‌టియు రాష్ట్ర స్థాయి సమావేశం
ABN, Publish Date - Feb 22 , 2025 | 05:43 AM
రైతాంగ జనబాహుళ్యమే ప్రధానంగా ఉన్న మన దేశంలో దున్నేవారికే భూమి లభించి, విదేశీ సామ్రాజ్యవాద దోపిడిని అరికట్టి...
భారత ప్రజల సంపూర్ణ విముక్తికి కార్మిక–కర్షక ఐక్యత సాధిస్తూ, నూతన ప్రజాస్వామిక విప్లవమే శరణ్యమని మరోసారి చాటిచెబుదాం. రైతాంగ జనబాహుళ్యమే ప్రధానంగా ఉన్న మన దేశంలో దున్నేవారికే భూమి లభించి, విదేశీ సామ్రాజ్యవాద దోపిడిని అరికట్టి, వారి మోచేతి నీళ్లు తాగే దళారీ పెట్టుబడిదారుల స్థానంలో స్వతంత్ర పారిశ్రామిక విధానంతో నిజమైన దేశభక్తియుత ప్రజాస్వామ్య విప్లవ కార్మికోద్యమ లక్ష్యంగా ఎఐఎఫ్‌టియు పోరాడుతుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 23న గోదావరిఖని పట్టణం, రాజ్యలక్ష్మి గార్డెన్స్, మార్కండేయ కాలనీ (కామ్రేడ్ కొమురన్న ప్రాంగణం)లో ఎఐఎఫ్‌టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతున్నది. ఉదయం 10 గంటలకు మెయిన్ చౌరస్తా తెలంగాణ అమరుల స్తూపం నుండి సభా ప్రాంగణం వరకు ర్యాలీ జరుగుతుంది. అనంతరం జరిగే సభలో సామ అనసూయ, మాతంగి రాయమల్లు, కె.లక్ష్మీనారాయణ, విమలక్క పాల్గొంటారు. తరువాత మల్లేశం అధ్యక్షతన జరిగే సభలో... కార్పొరేటీకరణ–కాంట్రాక్టీకరణల దోపిడీ–కర్తవ్యాలు అంశంపై అంబటి నాగయ్య ప్రసంగిస్తారు. పోచమల్లు అధ్యక్షతన జరిగే సభలో... 44 కార్మిక చట్టాల రద్దు– నాలుగు కోడ్‌లు–పర్యవసానాలు అంశంపై ఆచార్య కట్టా భగవంతరెడ్డి ప్రసంగిస్తారు. పట్లోల్ల నాగిరెడ్డి, వెల్తురు సదానందం, అరుణ, ఎస్.లావణ్య, అల్లూరి విజయ్, బాబూరావు తదితరులు ప్రసంగిస్తారు.
– అఖిలభారత కార్మిక సంఘాల సమాఖ్య (ఎఐఎఫ్‌టియు), తెలంగాణ
Updated Date - Feb 22 , 2025 | 05:43 AM