పండుగ తర్వాత
ABN, Publish Date - Mar 03 , 2025 | 12:46 AM
పట్నం వచ్చి పండుగ చేసుకుని వెళ్లింది పల్లె నిండా జంబో గ్లాస్‌లు ప్లాస్టిక్ బాటిల్స్ కార్లు తిరిగి క్యూకట్టి వెళ్లినాయి...
పట్నం వచ్చి పండుగ చేసుకుని వెళ్లింది
పల్లె నిండా జంబో గ్లాస్‌లు ప్లాస్టిక్ బాటిల్స్
కార్లు తిరిగి క్యూకట్టి వెళ్లినాయి
మూడు రోజుల వస్తు కనక ప్రదర్శన ముగింపు
నోట్ల కట్టలు గొప్ప గొప్ప మాటలు చెప్పాయి
బాగుపడాలంటే దగా బుర్ర పెట్టాలి అని
అందరూ సలహాలు మాత్రమే వదలి వెళ్లారు
అవసరం టోల్‌గేట్ దాటినాక సెల్ సైలెన్స్
మొహమాటానికి చేరిన నెంబర్‌లు డిలీట్
ఏ వరస ఇక అందుబాటులో వుండబోదు
మళ్ళీ పండుగ వరకు పల్లె వూసు రాదు
మూటల వేటలో మనుషులు మూస బతుకు
పచ్చని స్టేటస్లు పల్టీ కొట్టి మళ్లీ కాంక్రీట్ జంగిల్‌లో...
దాసరి మోహన్
99853 09080
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా
Updated Date - Mar 03 , 2025 | 12:46 AM