ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొన్ని వాక్యాలు

ABN, Publish Date - Mar 03 , 2025 | 12:49 AM

వాక్యాలు కలగాపులగం ఏ వాక్యం రంగు ఏమిటో ఏ సాంధ్య వర్ణాన్నడగాలి కొన్ని రాళ్ళు పరచుకున్న సరస్సు లోని నీలంరంగంత...

ప్రియ పద్యం

వాక్యాలు కలగాపులగం

ఏ వాక్యం రంగు ఏమిటో

ఏ సాంధ్య వర్ణాన్నడగాలి

కొన్ని

రాళ్ళు పరచుకున్న సరస్సు లోని నీలంరంగంత

పారదర్శకంగా ఉంటాయి.

ఇంకొన్ని

హేమంతంలోని

కారు అద్దాలపై కురిసిన

తుషారంలా స్పష్టాస్పష్టంగా దోబూచులాడతాయి

మరికొన్ని

సీతాకోక రెక్కల్లాటి పెదాలు మధ్య

అమాయకత్వాన్ని ఒలకబోసే

లాలిపప్‌లా రసానందం తొణికిసలాడిస్తాయి.

వాక్యాలంతే

అలసిన సాయంత్రాలకు

దోరగా వేయించి చేసిన

ఇన్‌స్టంట్‌ కాఫీ పరిమళాలను ఇస్తాయి.

దినం కొలిమిలో కాలిన చేతులకు

మునిమాపుల

పూలమృదుత్వంతో సుకుమారంగా

అనురాగపు మైలేపనాలవుతాయి.

వాక్యాలు

కుప్పనూర్పిడిలో తూర్పారబట్టే

పొట్టు పొల్లులా గాలివాటంలో

తేలిపోతుంటాయి

చాలా తక్కువ వాక్యాలు మాత్రమే

కొత్తగా కుట్టించుకున్న బట్టలకు

రాసిన అత్తరు పసుపు మరకలా

మనసుకు

అలా కలకాలం పట్టి నిలిచిపోతాయి

గరికపాటి మణిందర్

99483 26270


Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..

Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..

Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా

Updated Date - Mar 03 , 2025 | 12:52 AM