మనమ్మాయిలే ఫేవరెట్లు
ABN, Publish Date - Jan 31 , 2025 | 03:16 AM
డిఫెండింగ్ చాంపియన్ భారత్ అప్రతిహత విజయాలతో అండర్-19 టీ20 ప్రపంచ కప్ టైటిల్ నిలబెట్టుకొనే దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టును...
నేడు ఇంగ్లండ్‌తో సెమీఫైనల్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్
మ. 12 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
కౌలాలంపూర్ : డిఫెండింగ్ చాంపియన్ భారత్ అప్రతిహత విజయాలతో అండర్-19 టీ20 ప్రపంచ కప్ టైటిల్ నిలబెట్టుకొనే దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టును ఢీకొనేందుకు సిద్ధమైంది. నికీ ప్రసాద్ సారథ్యంలోని మన అమ్మాయిలు ఈసారి టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నారు. తెలుగు బౌలర్ షబ్నమ్, జోషిత ఆరంభంలోనే వికెట్లు తీస్తుండగా, స్పిన్నర్లు పరునిక, ఆయుషి, వైష్ణవి ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేస్తున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో..మరో తెలుగమ్మాయి త్రిష (59 బంతుల్లో 110 నాటౌట్) స్కాట్లాండ్‌తో పోరులో సూపర్ సెంచరీతో చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఏ విధంగా ఎదుర్కొంటారన్నది ఆసక్తికర అంశం. పైగా ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటింగ్‌లో నిలకడలేమి కనిపిస్తోంది. ఏదేమైనా.. ఈ సెమీఫైనల్లో మన అమ్మాయిలనే హాట్‌ఫేవరెట్లుగా క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక..ఉదయం 8 గంటలకు మొదలయ్యే తొలి సెమీ్‌సలో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటాయి.
ఇదీ చదవండి:
నాలుగో టీ20.. టీమిండియాకు సూపర్ న్యూస్.. మహాబలుడు వచ్చేస్తున్నాడు
కోహ్లీని భయపెట్టిన ఉపేంద్ర.. సొంతగడ్డపై అంతా చూస్తుండగానే..
ఎప్పుడూ చూడని రనౌట్.. ఇంతకంటే దురదృష్టవంతుడు ఉండడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 31 , 2025 | 03:16 AM