ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

92% లోకలైజేషన్‌ సాధించాం

ABN, Publish Date - Jan 22 , 2025 | 03:19 AM

కార్ల తయారీలో 92 శాతం లోకలైజేషన్‌ సాధించామని, 1,200 కీలక విడిభాగాలు దేశీయం గానే తయారుచేస్తున్నామని హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) ప్రకటించింది...

న్యూఢిల్లీ: కార్ల తయారీలో 92 శాతం లోకలైజేషన్‌ సాధించామని, 1,200 కీలక విడిభాగాలు దేశీయం గానే తయారుచేస్తున్నామని హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) ప్రకటించింది. విద్యుత్‌ వాహనాల బ్యాటరీ ప్యాక్‌లను కూడా దేశంలోనే తయారుచేస్తున్నట్టు వెల్లడించింది. మొబిస్‌ ఇండియా భాగస్వామ్యంతో తాము చెన్నై ప్లాంట్‌లో బ్యాటరీ ప్యాక్‌ల స్థానిక అసెంబ్లింగ్‌ చేపట్టినట్టు తెలిపింది. ఈ ప్లాంట్‌లో తయారైన బ్యాటరీ ప్యాక్‌తో మార్కెట్లోకి తెచ్చిన తొలి ఈవీ క్రెటా ఎలక్ర్టిక్‌ అని పేర్కొంది. ఈ స్థానికీకరణ చర్యల వల్ల 2019 నుంచి 67.2 కోట్ల డాలర్ల (రూ.5,678 కోట్లు) విదేశీ మారక ద్రవ్యం ఆదా అయినట్టు కంపెనీ తెలిపింది.


క్రెటా ఈవీ ధర రూ.17.99 లక్షలు: హెచ్‌ఎంఐఎల్‌ క్రెటా ఎలక్ర్టిక్‌ కారును మార్కెట్లోకి తెచ్చింది. భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోలో విడుదల చేసిన ఈ కారు ధర రూ.17.99 లక్షలు. రెండు బ్యాటరీ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఒకసారి చార్జింగ్‌తో 51.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ కారు 473 కిలోమీటర్లు, 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ కారు 390 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి

Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత

Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..

CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే

Updated Date - Jan 22 , 2025 | 03:23 AM