HPCL Chairmanఫ హెచ్‌పీసీఎల్ సారథిగా వికాస్ కౌశల్
ABN, Publish Date - Mar 08 , 2025 | 02:59 AM
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వికాస్ కౌశల్ నియమితులయ్యారు.
తొలిసారిగా ప్రైవేట్ కన్సల్టెంట్ చేతికి పగ్గాలు
న్యూఢిల్లీ: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వికాస్ కౌశల్ నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల కాలానికి ఈ నియామకం వర్తిస్తుంది. ఆయన గతంలో మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ కెర్నీలో పని చేశారు. ప్రైవేట్ రంగానికి చెందిన కన్సల్టెంట్‌కు ఒక ప్రభుత్వ రంగ సారథిగా పగ్గాలు అప్పగించడం ఇదే ప్రథమం. పీకే జోషి పదవీ విరమణ చేయడంతో గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న అర్హత నిబంధనలు సడలించి వికాస్ కౌశల్‌ను (53) హెచ్‌పీసీఎల్ సారథిగా నియమించాలంటూ పెట్రోలియం, సహజ వాయువుల శాఖ చేసిన ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్‌కు చెందిన నియామకాల కమిటీ ఆమోదించింది. ప్రభుత్వ రంగ సంస్థలకు సారథులను ఎంపిక చేసే పీఈఎస్‌బీ ఆ పదవికి సరైన వ్యక్తిని గుర్తించడంలో విఫలం కావడంతో సంబంధిత మంత్రిత్వ శాఖకు చెందిన అన్వేషణ, ఎంపిక కమిటీ కౌశల్‌ను ఎంపిక చేసింది.
Updated Date - Mar 08 , 2025 | 03:25 AM