ఈసారి పావు శాతం ‘రెపో కోత’
ABN, Publish Date - Feb 04 , 2025 | 06:19 AM
వినియోగ ఆధారిత వృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో తీసుకున్న చర్యలకు మద్దతుగా ఈ వారంలో ఆర్‌బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని నిపుణులంటున్నారు. అదే జరిగితే రెండేళ్ల పాటు...
రేపటి నుంచి ఎంపీసీ సమావేశం
ముంబై: వినియోగ ఆధారిత వృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో తీసుకున్న చర్యలకు మద్దతుగా ఈ వారంలో ఆర్‌బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని నిపుణులంటున్నారు. అదే జరిగితే రెండేళ్ల పాటు యథాతథంగా కొనసాగించిన అనంతరం రెపో రేటు తగ్గించినట్టవుతుంది. 2023 ఫిబ్రవరి సమీక్ష నుంచి (2022-23 ఆర్థిక సంవత్సరంలో చివరి సమీక్ష) రెపో రేటు 6.5 శాతం వద్దనే నిలకడగా ఉంది. 2020 మే నెలలో (కొవిడ్ సమయం) ఆర్‌బీఐ చివరి సారిగా రెపో రేటును తగ్గించింది. గత ఏడాదిలో ఎక్కువ కాలం ద్రవ్యోల్బణం ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశించిన గరిష్ఠ కట్టడి పరిధి (6 శాతం) కన్నా దిగువనే ఉండ డం ఆర్‌బీఐకి సానుకూలాంశమని వారంటున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా నాయకత్వంలో ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం బుధవారం ప్రారంభ కానుంది. శుక్రవారం నాడు ఎంపీసీ నిర్ణయాలను మల్హోత్రా ప్రకటిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Feb 04 , 2025 | 06:19 AM