టెక్ వ్యూ : కీలక మద్దతు 23,000 చేరువలో..
ABN, Publish Date - Jan 20 , 2025 | 05:18 AM
నిఫ్టీ గత వారం ప్రారంభంలో ప్రధాన మద్దతు స్థాయి 23,000 వద్ద మద్దతు తీసుకుని తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. కాని శుక్రవారం మరోసారి కరెక్షన్‌లో పడడం అప్రమత్త సంకే తం...
టెక్ వ్యూ : కీలక మద్దతు 23,000 చేరువలో..
నిఫ్టీ గత వారం ప్రారంభంలో ప్రధాన మద్దతు స్థాయి 23,000 వద్ద మద్దతు తీసుకుని తక్షణ డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. కాని శుక్రవారం మరోసారి కరెక్షన్‌లో పడడం అప్రమత్త సంకే తం. గత వారం నిఫ్టీ సైడ్‌వే్‌సలో పరిమిత పరిధిలో కదలాడి 230 పాయింట్ల నష్టంతో క్లోజయింది. టెక్నికల్‌గా మార్కెట్ వారం గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు నడుమన అనిశ్చితంగా ముగిసింది. గత రెండు వారాల్లో వెయ్యి పాయింట్ల మేరకు నష్టపోయింది. మిడ్‌క్యాప్-100 సూచీ 2,300 పాయింట్లు నష్టపోయినా బలమైన పునరుజ్జీవం సాధించి 22 పాయింట్ల స్వల్ప లాభంతో క్లోజైంది. స్మాల్‌క్యాప్-100 సూచీ కూడా 720 పాయింట్ల మేరకు నష్టపోయినా కోలుకుని ముందు వారంతో పోల్చితే 26 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. ప్రస్తుతం నిఫ్టీ మానసిక అవధి 23,000 సమీపంలో ఉంది. ఇక్కడ మరింత అప్రమత్త ట్రెండ్‌కు ఆస్కారం ఉంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి.
బుల్లిష్ స్థాయిలు: గత రెండు వారాల్లో నిట్టనిలువుగా దిగజారినందు వల్ల సానుకూలత కోసం కన్సాలిడేట్ కావడం అవసరం. ప్రస్తుత స్థాయిలో పాజిటివ్ ట్రెండ్ ప్రదర్శించినా మైనర్ నిరోధం 23,300 కన్నా పైన నిలదొక్కుకుని తీరాలి. ప్రధాన నిరోధం 23,500. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే స్వల్పకాలిక సానుకూలత ప్రదర్శిస్తుంది.
బేరిష్ స్థాయిలు: ఒక వేళ బలహీనత ప్రదర్శించినా ప్రధాన మద్దతు స్థాయి 23,000 వద్ద పునరుజ్జీవం తప్పనిసరి. మరింత బలహీనపడితే స్వల్పకాలిక బలహీనత ఎదుర్కొనక తప్పదు. అప్రమత్తత అవశ్యం.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 195 పాయింట్ల నష్టంతో 48,500 వద్ద ముగిసింది. రికవరీ బాట పడితే ప్రధాన నిరోధం 49,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మానసిక అవధి 48,000.
పాటర్న్: నిఫ్టీ ప్రస్తుతం 200 డిఎంఏ కన్నా దిగువకు వచ్చింది. సానుకూలత కోసం ఇక్కడ బౌన్స్‌బ్యాక్ కావాలి. అలాగే మార్కెట్ ప్రస్తుతం 23,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’, గతంలో ఏర్పడిన బాటమ్‌కు చేరువవుతోంది. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే మరింత దిగజారవచ్చు.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
వి. సుందర్ రాజా
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,300, 23,370
మద్దతు : 23,080, 23,000
Updated Date - Jan 20 , 2025 | 05:18 AM