ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టెక్‌ వ్యూ : కీలక మద్దతు 22000 చేరువలో...

ABN, Publish Date - Mar 03 , 2025 | 01:51 AM

నిఫ్టీ గత వారం మొత్తం మీద 670 పాయుంట్లు, నెల మొత్తం మీద 1,400 పాయింట్లు నష్టంతో 22,125 వద్ద ముగిసింది. గత అక్టోబరు నుంచి వరుసగా ఐదు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లోనే ఉంది....

టెక్‌ వ్యూ : కీలక మద్దతు 22000 చేరువలో...

నిఫ్టీ గత వారం మొత్తం మీద 670 పాయుంట్లు, నెల మొత్తం మీద 1,400 పాయింట్లు నష్టంతో 22,125 వద్ద ముగిసింది. గత అక్టోబరు నుంచి వరుసగా ఐదు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లోనే ఉంది. నెల మొత్తం మీద మిడ్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ 5,800 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ 2,200 పాయింట్లు నష్టపోయాయి. గత కొద్ది వారాలుగా నిఫ్టీ నిట్టనిలువుగా దిగజారినందు వల్ల ఈ వారంలో పుల్‌బ్యాక్‌ రికవరీకి ఆస్కారం ఉంది. అలాగే శుక్రవారం నాటి ప్రపంచ మార్కెట్‌ ధోరణులను బట్టి చూసినా రికవరీ అవకాశాలున్నాయి.


బుల్లిష్‌ స్థాయిలు: ధోరణిలో స్పష్టత రావాలంటే మార్కెట్‌ మొదట నిలదొక్కుకోవాలి. ప్రస్తుతం ప్రధాన మద్దతు స్థాయి 22,000 కన్నా స్వల్పంగా పైన ఉంది. సానుకూలత కోసం ఈ స్థాయిలో కన్సాలిడేట్‌ కావాలి. ప్రధాన నిరోధం 22,350. స్వల్పకాలిక అవరోధం 22,500.

బేరిష్‌ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా ప్రధాన మద్దతు స్థాయి 22,000 వద్ద నిలదొక్కుకుని తీరాలి. అప్పుడే మరింత డౌన్‌ట్రెండ్‌ నివారించుకోగలుగుతుంది. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా ఏర్పడుతుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ 48,000 కన్నా పైన కన్సాలిడేట్‌ అవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రధాన నిరోధం 49,000. సానుకూలత కోసం ఆ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతు స్థాయి 47,800. ఇక్కడ విఫలమైతే స్వల్పకాలిక బలహీనత కొనసాగుతున్నట్టు భావించి అప్రమత్తం కావాలి.


పాటర్న్‌: సానుకూలత కోసం నిఫ్టీ 22,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. మార్కెట్‌ ప్రస్తుతం ఓవర్‌సోల్డ్‌ స్థితికి చేరుకున్నందు వల్ల రికవరీకి ఆస్కారం ఉంది. షార్ట్‌ టర్మ్‌ ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 22,280, 22,350

మద్దతు : 22,090, 22,000

వి. సుందర్‌ రాజా


Read Also : Business Ideas: ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..

మిణుగురుల ప్రపంచంలోకి...

SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..

మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2025 | 01:51 AM