ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘డిస్‌ప్లే చిప్‌’ల తయారీలోకి టాటా

ABN, Publish Date - Mar 06 , 2025 | 04:04 AM

టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలకా్ట్రనిక్స్‌ డిస్‌ప్లే చిప్‌ల తయారీలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన పీఎ్‌సఎంసీ, హైమాక్స్‌ టెక్నాలజీ్‌సతో కలిసి...

గుజరాత్‌లో ప్లాంట్‌ ఏర్పాటు

గాంధీనగర్‌: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలకా్ట్రనిక్స్‌ డిస్‌ప్లే చిప్‌ల తయారీలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం తైవాన్‌కు చెందిన పీఎ్‌సఎంసీ, హైమాక్స్‌ టెక్నాలజీ్‌సతో కలిసి గుజరాత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు టాటా ఎలకా్ట్రనిక్స్‌ సీఈఓ రణధీర్‌ ఠాకూర్‌ బుధవారం తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటు కోసం గుజరాత్‌ ప్రభుత్వంతో అగ్రిమెంట్‌ కూడా కుదుర్చుకున్నట్లు ఐఈఎ్‌సఏ విజన్‌ సదస్సులో వెల్లడించారు. డిస్‌ప్లే చిప్‌లను టీవీలు, మొబైల్‌ ఫోన్‌ స్ర్కీన్లు, కెమెరా ఇమేజ్‌ సెన్సర్లు, ఎల్‌ఈడీలు, ఓఎల్‌ఈడీ ఉత్పత్తుల్లో విరివిగా వాడతారు. అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్‌ సైతం గుజరాత్‌లో డిస్‌ప్లే చిప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ, ఆ ప్రతిపాదిత ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ఇంకా అనుమతులు మంజూరు చేయలేదు.


ప్లాంట్‌కు ఆర్థిక మద్దతు కోసం ఒప్పందం: రూ.91,000 కోట్ల పెట్టుబడులతో గుజరాత్‌లో ఏర్పాటు చేయబోతున్న సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్‌కు ఆర్థిక మద్దతు కోసం టాటా ఎలకా్ట్రనిక్స్‌, టాటా సెమీకండక్టర్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు బుధవారం ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌తో (ఐఎ్‌సఎం) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఐఎ్‌సఎం ద్వారా కేంద్రం అర్హత కలిగిన ప్రాజెక్టులకు వ్యయాల్లో 50 శాతం ఆర్థిక మద్దతు కల్పించనుంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2025 | 04:04 AM