ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిటైల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ రంగంలోకి టాటా డిజిటల్‌

ABN, Publish Date - Jan 08 , 2025 | 03:10 AM

రిటైల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ విభాగంలోకి అడుగు పెడుతున్నట్టు టాటా డిజిటల్‌ మంగళవారం ప్రకటించింది. టాటా న్యూ సూపర్‌ యాప్‌పై తొలిసారిగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) విడుదల చేసినట్టు తెలిపింది....

న్యూఢిల్లీ: రిటైల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ విభాగంలోకి అడుగు పెడుతున్నట్టు టాటా డిజిటల్‌ మంగళవారం ప్రకటించింది. టాటా న్యూ సూపర్‌ యాప్‌పై తొలిసారిగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) విడుదల చేసినట్టు తెలిపింది. వినియోగదారులు సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా అవసరం లేకుండానే ఈ మార్కెట్‌ ప్లేస్‌ ద్వారా ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని, డిపాజిట్‌పై వడ్డీ రేటు 9.1 శాతం వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. రూ.1,000 అతి చిన్న మొత్తం నుంచి ఇన్వెస్ట్‌ చేయవచ్చని తెలిపింది. డిపాజిట్లన్నింటికీ రూ.5 లక్షల వరకు డీఐసీజీసీ బీమా లభిస్తుందని, దీనివల్ల తమ సొమ్ము భద్రమే అన్న భరోసా వారికి లభిస్తుందని పేర్కొంది. బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీల డిపాజిట్ల నుంచి తమకు ఆకర్షణీయంగా కనిపించిన దాన్ని కస్టమర్లు ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌ చేయవచ్చని తెలిపింది.

Updated Date - Jan 08 , 2025 | 03:10 AM