ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రత్యేక ఎఫ్‌డీ.. అధిక వడ్డీ

ABN, Publish Date - Jan 26 , 2025 | 02:37 AM

రిస్క్‌ లేకుండా అధిక వడ్డీ ఆశిస్తున్నారా? ప్రస్తుత మార్కెట్లో అసలు అలాంటి అవకాశం ఉందా? ఉంటే ఏంటా అవకాశం? ఎవరు అందిస్తున్నారు ఆ అవకాశం? అయితే ఈ వివరాలు మీకోసమే.. .

రిస్క్‌ లేకుండా అధిక వడ్డీ ఆశిస్తున్నారా? ప్రస్తుత మార్కెట్లో అసలు అలాంటి అవకాశం ఉందా? ఉంటే ఏంటా అవకాశం? ఎవరు అందిస్తున్నారు ఆ అవకాశం? అయితే ఈ వివరాలు మీకోసమే..

కస్టమర్లకు బ్యాంకుల ఆఫర్లు .. వడ్డీ రేటు, కాలపరిమితులూ రెండూ స్పెషలే..

దేశీయంగా బ్యాంకులు కూడా ప్రస్తుతం నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. చదవడానికి వింతగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. గత వారం ఒక దశలో మన దేశ బ్యాంకింగ్‌ రంగంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల నిధుల కొరత ఏర్పడింది. రుణాల వృద్ధికి తగ్గట్టు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) పెరగకపోవడం ఇందుకు ప్రధాన కారణం. గత ఏడాది బ్యాంకింగ్‌ రంగం రుణాల గిరాకీ 11.1 శాతం పెరిగితే.. ఎఫ్‌డీల వృద్ధి రేటు 9.8 శాతం మాత్రమే. డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకులు ఎంత ప్రయత్నించినా పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. చాలా మంది మదుపరులు ముఖ్యంగా మిలీనియల్స్‌ తమ పొదుపు మొత్తాలను ఎఫ్‌డీలకు బదులు.. నష్టభయం (రిస్క్‌) ఉన్నప్పటికీ స్టాక్‌ మార్కెట్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలకు మళ్లించడమే ఇందుకు ప్రధాన కారణం.


పోటా పోటీగా పథకాలు

రిస్క్‌ ఫ్రీ మదుపరులను, సీనియర్‌ సిటిజన్లను ఆకర్షించేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), ఇండియన్‌ బ్యాంక్‌.. గత ఏడాది జూలై నుంచి ‘స్పెషల్‌ టెన్యూర్‌ ఎఫ్‌డీ (ప్రత్యేక కాలపరిమితితో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌)’ పేరుతో స్వల్పకాలిక ఎఫ్‌డీ పథకాలు ప్రారంభించాయి. ఈ పథకాల సబ్‌స్ర్కిప్షన్‌ గడువు ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగియబోతోంది. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే ఈ స్వల్పకాలిక ఎఫ్‌డీలపై వడ్డీ రేటు ఎక్కువ. ఏ మాత్రం నష్టభయం లేకుండా అధిక వడ్డీ కోసం చూసే మదుపరులకు ఈ డిపాజిట్‌ పథకాలు అత్యంత అనువైనవి.


బీఓబీ ఉత్సవ్‌ డిపాజిట్‌ స్కీమ్‌

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) 400 రోజుల కాలపరిమితితో ‘బీఓబీ ఉత్సవ్‌ డిపాజిట్‌ స్కీమ్‌’ పేరుతో ప్రత్యేక డిపాజిట్‌ పథకాన్ని తీసుకువచ్చింది. బీఓబీ ఈ స్కీమ్‌పై 7.3 శాతం వార్షిక వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు మరో అర శాతం వడ్డీ (7.8 శాతం) అధికంగా అందిస్తోంది.

ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌, అమృత్‌ వృష్టి

ఎస్‌బీఐ 400 రోజుల కాలపరిమితితో అమృత్‌ కలశ్‌, 444 కాలపరిమితితో అమృత్‌ వృష్టి పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అమృత్‌ కలశ్‌ స్పెషల్‌ టెన్యూర్‌ ఎఫ్‌డీపై 7.10 శాతం, అమృత్‌ వృష్టి స్పెషల్‌ టెన్యూర్‌ ఎఫ్‌డీపై 7.25 శాతం వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తోంది. ఈ రెండు ఎఫ్‌డీలపై సీనియర్‌ సిటిజన్లకు అదనంగా మరో అర శాతం వడ్డీని అందిస్తోంది.


ఇండియన్‌ బ్యాంక్‌ ఇండ్‌ సుప్రీం

ఇండియన్‌ బ్యాంక్‌ 300 రోజుల కాలపరిమితో ఇండ్‌ సుప్రీం పేరుతో ఈ ప్రత్యేక డిపాజిట్‌ పథకాలను ప్రారంభించింది. ఈ ఎఫ్‌డీలపై 7.3 శాతం వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. ఈ పథకంపైనా సీనియర్‌ సిటిజన్లకు మరో అర శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది.

ఎవరికి మేలు?

స్వల్పకాలంలో నష్టభయం లేకుండా హామీతో కూడిన రాబడులు ఆశించే సంప్రదాయ మదుపరులకు, సీనియర్‌ సిటిజన్లకు 7 శాతానికిపైగా వడ్డీ రేటు ఆఫర్‌ చేసే ఈ స్పెషల్‌ టెన్యూర్‌ ఎఫ్‌డీలు అత్యంత అనుకూలం. స్వల్పకాలిక పెట్టుబడుల వివిధీకరణ కోసం చూసే వ్యక్తిగత మదుపరులు కూడా ఈ ప్రత్యేక డిపాజిట్లపై ఒక కన్నేయవచ్చు.


జాగ్రత్తలు తప్పవు..

ఈ స్పెషల్‌ టెన్యూర్‌ ఎఫ్‌డీలు అందరికీ అనుకూలమని చెప్పలేం. కాబట్టి మదుపు చేసే ముందే డిపాజిట్‌ కాల పరిమితి, వడ్డీ రేటుతో పాటు కనీస డిపాజిట్‌ ఎంత? ఏదైనా అవసరం వచ్చి ఎఫ్‌డీని ముందే వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉందా? ఉంటే అందుకు ఎంత పెనాల్టీ చెల్లించాలి? వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను పోటు, రాబడులపై ద్రవ్యోల్బణం ప్రభావం వంటి అన్ని విషయాలను ముందే తెలుసుకోవాలి. లేకపోతే నగదు లభ్యత (లిక్విడిటీ) దెబ్బతింటుంది.


త్వరపడితే బెటర్‌

అమెరికా, జపాన్‌, యూకే, ఈయూతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. మన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కూడా త్వరలోనే ఇందుకు సిద్ధమవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నష్టభయం లేకుండా హామీతో కూడిన అధిక రాబడులు ఆశించే మదుపరులు, సీనియర్‌ సిటిజన్లు మార్చిలోగా ఈ ఎఫ్‌డీలను ఎంచుకోవడం మంచిది. స్టాక్‌ మార్కెట్‌ కూడా ప్రస్తుతం తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ఈ మార్కెట్లోని మదుపరులు కూడా తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఈ ఎఫ్‌డీలకు మళ్లించడం మంచిది. కాకపోతే వీరు వీలైనంత తక్కువ కాలపరిమితి ఉండే స్పెషల్‌ టెన్యూర్‌ ఎఫ్‌డీలను లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ అందించే లిక్విడ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం మేలు.


ఇవి కూడా చదవండి

Uttar Pradesh: మహాకుంభమేళాకు ఇండియన్ క్రికెట్ టీమ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ.. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో భారీ భద్రత..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 26 , 2025 | 02:37 AM