ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాపిజెన్‌ బయోలాజిక్స్‌ ప్లాంట్‌లో సింగపూర్‌ ప్రెసిడెంట్‌

ABN, Publish Date - Jan 19 , 2025 | 01:44 AM

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అనుబంధ విభాగమైన సాపిజెన్‌ బయోలాజిక్స్‌ వ్యాక్సిన్ల తయారీ ప్లాంట్‌ను సింగపూర్‌ అధ్యక్షులు థర్మన్‌ షణ్ముగరత్నం...

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అనుబంధ విభాగమైన సాపిజెన్‌ బయోలాజిక్స్‌ వ్యాక్సిన్ల తయారీ ప్లాంట్‌ను సింగపూర్‌ అధ్యక్షులు థర్మన్‌ షణ్ముగరత్నం శనివారం సందర్శించారు. భారత్‌ బయోటెక్‌ వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా ఆయనకు స్వాగతం పలికారు. ఒడిశా, భువనేశ్వర్‌లోని బయోటెక్‌ పార్క్‌లో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో, ఏటా 800 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. కలరా, మలేరియా, పోలియో సహా 10 రకాల వ్యాక్సిన్లను ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నట్లు సాపిజెన్‌ బయోలాజిక్స్‌ తెలిపింది.

Updated Date - Jan 19 , 2025 | 02:25 AM