75,000 దిగువకు సెన్సెక్స్
ABN, Publish Date - Feb 25 , 2025 | 02:14 AM
ఈక్విటీ మార్కెట్‌పై బేర్ పట్టును మరింత బిగించింది. అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ నిధుల తరలింపు, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. వరుసగా ఐదో సెషన్‌లో కూడా...
ఐదో రోజూ ఆగని పతనం
రూ.4.22 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: ఈక్విటీ మార్కెట్‌పై బేర్ పట్టును మరింత బిగించింది. అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ నిధుల తరలింపు, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. వరుసగా ఐదో సెషన్‌లో కూడా ఈక్విటీ సూచీలు భారీ నష్టాలు చవి చూశాయి. దీంతో సోమవారం సెన్సెక్స్ 856.65 పాయింట్ల నష్టంతో 74,454.41 వద్ద ముగిసింది. ఒక దశలో ఇండెక్స్ 923.63 పాయింట్లు నష్టపోయి 74,387.44 వరకు దిగజారింది. నిఫ్టీ 242.55 పాయింట్ల మేరకు దిగజారి 22,553.35 వద్ద ముగిసింది. ప్రధానంగా ఐటీ, టెలికాం, మెటల్ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌ను భారీ నష్టాల్లోకి నెట్టాయి. బీఎ్‌సఈలో 2,810 షేర్లు నష్టపోగా 1,207 షేర్లు మాత్రం లాభపడ్డాయి. 183 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సెన్సెక్స్ నష్టపోవడం వరుసగా ఇది ఐదో రోజు. ఈ ఐదు రోజుల్లో సూచీ 1,542.45 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 406.15 పాయింట్లు దిగజారింది. మార్కెట్‌పై ఏర్పడిన బేర్ పట్టుతో మార్కెట్ సూచీలు ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయిలకు దిగజారాయని విశ్లేషకులంటున్నారు. రాబోయే కాలంలో కూడా ప్రపంచ మార్కెట్ల గమనమే మన మార్కెట్‌ను భారీగా ప్రభావితం చేస్తుందని, ఫలితంగా భారీ రిస్క్‌కు ఇష్టపడని రిటైల్ ఇన్వెస్టర్లు అనిశ్చితిని ఎదుర్కొంటారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ అంటున్నారు.
ఇన్వెస్టర్లు లబోదిబో : రెండు వారాలుగా మార్కెట్‌పై బేర్ పట్టు బిగియడం ఇన్వెస్టర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం నాటి భారీ పతనం కారణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద రూ.4.22 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. నికరంగా రూ.4,22,983.08 కోట్లు (4.59 లక్షల కోట్ల డాలర్లు) నష్టంతో రూ.3,97,97,305.47 కోట్ల వద్ద స్థిరపడింది.
బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సూచీ 1.31 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 0.78 శాతం నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ గరిష్ఠంగా 2.65 శాతం నష్టపోయింది. టెక్ (2.56ు), టెలీ కమ్యూనికేషన్ (2.26ు), మెటల్ (2.16ు), కమోడిటీస్ (1.53ు), యుటిలిటీస్ (1.42ు) నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ మాత్రం లాభపడ్డాయి..
ఇవి కూడా చదవండి:
Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్
OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 25 , 2025 | 02:14 AM