SBI : ఎస్‌బీఐ రెండు కొత్త డిపాజిట్ పథకాలు
ABN, Publish Date - Jan 04 , 2025 | 06:05 AM
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ.. హర్ ఘర్ లఖ్‌పతీ, ఎస్‌బీఐ ప్యాట్రన్స్ పేరుతో రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించింది. హర్ ఘర్ లఖ్‌పతీ ప్రీ-
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ.. హర్ ఘర్ లఖ్‌పతీ, ఎస్‌బీఐ ప్యాట్రన్స్ పేరుతో రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించింది. హర్ ఘర్ లఖ్‌పతీ ప్రీ-క్యాల్కులేటెడ్ రికరింగ్ డిపాజిట్ పథకమని, కస్టమర్లు రూ.లక్ష చొప్పున పొగేసుకునేందుకు దోహదపడనుందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఎస్‌బీఐ తెలిపింది. ఈ పథకం ఆర్థిక లక్ష్యాల సాధన ప్రక్రియను సరళీకరిస్తుందని, కస్టమర్లు భవిష్యత్ ఆర్థిక ప్రణాళిక రచించుకోవడంతో పాటు సమర్థవంతంగా ఆదా చేసేందుకు అనుమతిస్తుందని బ్యాంక్ పేర్కొంది. కాగా, 80 ఏళ్లు, ఆపైబడిన సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ ప్యాట్రన్స్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ వెల్లడించింది.
ప్రస్తుత, కొత్త కస్టమర్లందరికీ ఈ పథకం అందుబాటులో ఉంటుందని.. ఈ పథకంపై సీనియర్ సిటిజన్లకు ఆఫర్ చేసే వడ్డీ రేటు కంటే 0.10 శాతం అధికంగా చెల్లించడం జరుగుతుందని బ్యాంక్ స్పష్టం చేసింది. రికరింగ్ డిపాజిట్ పథకానికి మిగతా ఎఫ్‌డీలకు చెల్లించే వడ్డీనే లభించనుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఏడాదికి పైగా కాలపరిమితి డిపాజిట్లపై 6.80 శాతం, రెండేళ్లకు పైగా ఎఫ్‌డీపై 7 శాతం, 3-5 ఏళ్ల డిపాజిట్‌పై 6.75 శాతం, 5-10 ఏళ్ల డిపాజిట్‌పై 6.5 శాతం వార్షిక వడ్డీ ఆఫర్ చేస్తోంది. రికరింగ్ డిపాజిట్ కనీస కాలపరిమితి ఏడాది. గరిష్ఠ కాలపరిమితి 10 ఏళ్లుగా ఉంది.
Updated Date - Jan 04 , 2025 | 06:05 AM