ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SBI : మహిళా ఆంత్రప్రెన్యూర్ల కోసం ఎస్‌బీఐ అస్మిత

ABN, Publish Date - Mar 08 , 2025 | 02:48 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల..

ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల (ఆంత్రప్రెన్యూర్స్‌) కోసం తక్కువ వడ్డీతో కూడిన తనఖారహిత రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. అస్మిత పేరుతో ఈ పథకాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఈ రుణ పథకం మహిళల సారథ్యంలో నడిచే సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వేగంగా, సులువుగా ఫైనాన్స్‌ అందిస్తుందని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. కాగా, ఎస్‌బీఐ మహిళల కోసం నారీ శక్తి పేరుతో రూపే ప్లాటినమ్‌ డెబిట్‌ కార్డ్‌ను సైతం విడుదల చేసింది.

బీఓబీ గ్లోబల్‌ విమెన్‌ ఎన్‌ఆర్‌ఈ ఖాతా

ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ‘‘గ్లోబల్‌ విమెన్‌ ఎన్‌ఆర్‌ఈ, ఎన్‌ఆర్‌ఓ సేవింగ్స్‌ అకౌంట్‌’’ ప్రారంభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఒకటి ఈ రకమైన ఎస్‌బీ ఖాతా తెరవడం ఇదే ప్రథమం. కస్టమర్లు అధిక వడ్డీ రేటు పొందేందుకు వీలుగా ఆటో స్వీప్‌ సదుపాయంతో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు ప్రాసెసింగ్‌ చార్జీలు కూడా ఇతర ఖాతాల కన్నా తక్కువగా ఉంటాయి. గృహ, ఆటో రుణాలు రాయితీ వడ్డీ రేట్లకు అందుబాటులోకి వస్తాయి.

Updated Date - Mar 08 , 2025 | 02:48 AM