‘స్టార్టప్స్’ ఈక్విటీకీ అనుమతించాలి ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి
ABN, Publish Date - Feb 26 , 2025 | 05:29 AM
స్టార్టప్ కంపెనీల ఈక్విటీలోనూ బ్యాంకుల పెట్టుబడులను అనుమతించాలని ఎస్‌బీఐ చైర్మన్ సీ శ్రీనివాసులు శెట్టి కోరారు. ముంబైలో జరుగుతున్న నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ సదస్సులో...
ముంబై: స్టార్టప్ కంపెనీల ఈక్విటీలోనూ బ్యాంకుల పెట్టుబడులను అనుమతించాలని ఎస్‌బీఐ చైర్మన్ సీ శ్రీనివాసులు శెట్టి కోరారు. ముంబైలో జరుగుతున్న నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ సదస్సులో ఆయన ఈ సూచన చేశారు. ప్రస్తుతం తమకు ఈ కంపెనీలకు రుణాలు సమకూర్చే స్వేచ్ఛ తప్ప.. ఈక్విటీలో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ లేదన్నారు. స్టార్టప్ కంపెనీల ఈక్విటీలోనూ బ్యాంకులు పెట్టుబడులు పెట్టే వాతావరణం దేశంలో ఏర్పడాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు రూ.100 కోట్ల వరకు ఇచ్చే రుణాల చెల్లింపులకు ఒక హామీ పథకం తీసుకు వచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు శెట్టి వెల్లడించారు. స్టార్టప్ కంపెనీల రుణ అవసరాల కోసం ఎస్‌బీఐ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏడు ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Amit Shah: 2 రోజుల్లోనే రూ. 30,77,000 కోట్ల పెట్టుబడులు.. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రశంసలు
Liquor Scam: లిక్కర్ స్కాం వల్ల ప్రభుత్వానికి 2 వేల కోట్లకుపైగా నష్టం..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 26 , 2025 | 05:29 AM