ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెస్టారెంట్‌ సేవలు- జీఎ్‌సటీ మార్పులు

ABN, Publish Date - Jan 05 , 2025 | 05:55 AM

ఇటీవల జరిగిన జీఎ్‌సటీ కౌన్సిల్‌ 55వ సమావేశంలో రెస్టారెంట్‌ సర్వీసులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటం జరడింది. ఆ వివరాలు...

ఇటీవల జరిగిన జీఎ్‌సటీ కౌన్సిల్‌ 55వ సమావేశంలో రెస్టారెంట్‌ సర్వీసులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటం జరడింది. ఆ వివరాలు..

సాధారణంగా హోటల్‌లో రెండు రకాల సర్వీ్‌సలు లభిస్తాయి. మొదటిది అకామిడేషన్‌ సర్వీస్‌.. అంటే రూమ్‌ అద్దెకి ఇవ్వటం, రెండోది రెస్టారెంట్‌ సర్వీస్‌. అంటే భోజన ఫలహారాలు అందించటం. కొన్ని చోట్ల రెండు సర్వీ్‌సలు కలిపి ఉండవచ్చు లేదా విడివిడిగా ఉండవచ్చు. రూములతో సంబంధం లేకుండా కేవలం భోజన ఫలహారాలు అందించే హోటల్‌ లేదా రెస్టారెంట్స్‌ను ‘స్టాండ్‌అలోన్‌’ రెస్టారెంట్‌ అంటారు. అంటే ఇందులో అకామిడేషన్‌ సర్వీస్‌ ఉండదు. కేవలం రెస్టారెంట్‌ సర్వీస్‌ మాత్రమే ఉంటుంది. ఇటువంటి రెస్టారెంట్లలో జీఎ్‌సటీ 5 శాతం వర్తిస్తుంది. వీళ్లు క్యాటరింగ్‌ సర్వీస్‌ చేసినా 5 శాతం జీఎ్‌సటీ చెల్లిస్తే సరిపోతుంది. ఇది చాలా సులభం. ఇందులో ఎలాంటి సమస్యా లేదు. వచ్చిన చిక్కల్లా హోటల్‌లో భాగంగా ఉండే రెస్టారెంట్‌లోనే. అంటే పైన చెప్పినట్లు రెండు సర్వీ్‌సలు కలిసి ఉన్నప్పుడే. ఇక్కడ రెస్టారెంట్‌లో జీఎ్‌సటీ అనేది ఆ హోటల్‌లోని రూమ్‌ అద్దె ధర మీద ఆధారపడి ఉంటుంది.


ఒక హోటల్‌లో రకరకాల రూములు ఉంటాయనే సంగతి తెలిసిందే. స్టాండర్డ్‌, ఎగ్జిక్యూటివ్‌, డీలక్స్‌, సూట్‌ రూమ్‌ ఇలా. వీటిలో ఏదేనీ రూమ్‌ డిక్లేర్డ్‌ టారిఫ్‌ రోజుకు రూ.7,500 మించి ఉంటే ఇలాంటి హోటల్‌ను స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ అంటారు. ఇలా స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ కిందకు వచ్చే హోటల్‌లోని రెస్టారెంట్లకు 18 శాతం జీఎ్‌సటీ వర్తిస్తుంది. ఒకవేళ ఆ హోటల్‌ స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ కిందకు రాకుంటే అప్పుడు మామూలు జీఎ్‌సటీ 5 శాతమే వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక హోటల్‌లో 20 రూములు ఉన్నాయి. అందులో ఒకటి సూట్‌ రూమ్‌ కాగా, మిగతావి సాధారణ రూములు అనుకుందాం. సూట్‌ రూమ్‌ అద్దె రోజుకు రూ.8,000 అనుకుంటే ఆ హోటల్‌ స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ అవుతుంది. అంటే రూ.7,500 కంటే ఎక్కువ అద్దె తీసుకునే రూమ్‌ ఒక్కటే ఉన్నా, దాని బుకింగ్స్‌ తక్కువ ఉన్నా ఆ రెస్టారెంట్‌లోని సర్వీస్‌ మీద 18 శాతం జీఎ్‌సటీ వర్తిస్తుంది.

అలాగే అద్దె కూడా వాస్తవంగా తీసుకునే అద్దె కాకుండా ‘డిక్లేర్డ్‌ టారిఫ్‌’ ప్రకారం లెక్కించాలి. ‘డిక్లేర్డ్‌ టారిఫ్‌’ అంటే లిస్ట్‌లో లేదా టారిఫ్‌ కార్డులో లేదా ఇతర ప్రదేశాల్లో ప్రకటించే ధర. ఉదాహరణకు ఒక హోటల్‌ వెబ్‌సైట్‌లో లేదా టారిఫ్‌ కార్డులో రూము ధర రూ.7,500 కంటే ఎక్కువ ఉండవచ్చు. డిస్కౌంట్‌ పోనూ రూము వాస్తవ ధర రూ.7,500 కంటే తక్కువ ఉండొచ్చు. అయినా ఆ హోటల్‌ స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ కిందకే వస్తుంది. కేవలం టారిఫ్‌ కార్డులోని ధరను బట్టి (అంటే డిక్లేర్డ్‌ టారిఫ్‌) ఆ హోటల్‌ను స్పెసిఫైడ్‌ ప్రెమిసె్‌సగా గుర్తించటం వల్ల జీఎ్‌సటీ 18 శాతం కట్టాల్సి ఉంటుంది.


ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని 55వ జీఎ్‌సటీ కౌన్సిల్‌ సమావేశంలో దీనికి సంబంధించి సవరణ చేయటం జరిగింది. దీని ప్రకారం ఒక హోటల్‌ స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ కిందకు వస్తుందా లేదా అనేది డిక్లేర్డ్‌ టారి్‌ఫను బట్టి కాకుండా వాస్తవంగా వసూలు చేసే అద్దెను బట్టి నిర్ణయించటం జరుగుతుంది. అది కూడా క్రితం ఆర్థిక సంవత్సరంలోని అద్దెను బట్టి ఉంటుంది. దీనివల్ల టారిఫ్‌ కార్డు ప్రకారం రూము అద్దె రూ.7,500 పై ఉన్నప్పటికీ.. వాస్తవ అద్దె రూ.7,500 కంటే తక్కువ ఉంటే అది స్పెసిఫైడ్‌ ప్రెమిసెస్‌ కిందకు రాదు. అప్పుడు రెస్టారెంట్‌ సర్వీ్‌సకు 5 శాతం జీఎ్‌సటీ కడితే సరిపోతుంది.

ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఉన్న నిబంధన ప్రకారం రెస్టారెంట్‌ సర్వీస్‌ మీద 5 శాతం జీఎ్‌సటీ కట్టినప్పుడు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కొత్త సవరణ ప్రకారం 5 శాతానికి బదులుగా 18 శాతం జీఎ్‌సటీని ఎంచుకొని ఐటీసీ తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి ఆర్థిక సంవత్సరం మొదట్లో లేదా రిజిస్ట్రేషన్‌ తీసుకునే సమయంలో ఒక డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.


రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - Jan 05 , 2025 | 05:55 AM